Meenakshi Chaudhary: తిరుమలపై మీనాక్షి చౌదరి వీడియో.. ఓ వైపు ప్రశంసలు, మరోవైపు ట్రోలింగ్
తిరుమల విశిష్టతపై మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- V Santhosh Kumar
- Updated on- February 25, 2026 / 11:11 AM IST
A special video of Meenakshi at Tirumala has gone viral on social media.
- తిరుమల వెళ్లిన హీరోయిన్ మీనాక్షి చౌదరి
- టీటీడీ సేవలపై ప్రేత్యేక వీడియో విడుదళ
- కావాలనే చేయించారు అంటూ ట్రోల్స్
Meenakshi Chaudhary: టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇటీవల తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆమె తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్లారు. అనంతరం తిరుమల విశిష్టత గురించి, అక్కడ భక్తులకు అందుతున్న సేవలు, అన్నప్రసాదాల గురించి ఒక వీడియో చేశారు.
Mrunal Thakur: జిమ్ లో అమ్మాయి అన్న మాటలు.. నాకు ఇంకా గుర్తున్నాయి.. వాచిన కళ్ళతో లేచిన రోజులు
ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నా మనసుకు ఎంతో ఆనందం, ప్రశాంతత లభించింది. ఇక్కడ వీచే గాలిలో కూడా ఆ గోవిందా నామాలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక టీటీడీ మ్యానేజ్మెంట్ చాలా గొప్పగా ఉంది. దర్శనం దగ్గర నుంచి, అన్నప్రసాదాల వరకు అన్ని సేవలు అద్భుతంగా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
దాంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, మీనాక్షి(Meenakshi Chaudhary) చేసిన ఈ వీడియోపై చాలా మంది నెటిజన్స్ స్పందిస్తున్నారు. నిజంగా తిరుమలలో సేవలు చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, తిరుమలపై తన అభిప్రాయాన్ని పంచుకున్న మీనాక్షి పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఒక వర్గం వారు మాత్రం ఈ విషయంలో నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమల విషయంలో జరుగుతున్న వివాదాన్నిడైవర్ట్ చేయడానికి కావాలని ఇలాంటి వీడియోలను చేయిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మీనాక్షి ఈ టైంలో తిరుమల గురించి మాట్లాడటం అనేది ఆసక్తికరంగా మారింది.
