గ్యాంగ్ రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు, జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
టాలీవుడ్లో మరో వివాదం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు నటి మీరాచోప్రా ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని ఇన్స్టాగ్రామ్
- Naveen
- Published on- June 3, 2020 / 07:23 AM IST
టాలీవుడ్లో మరో వివాదం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు నటి మీరాచోప్రా ఫిర్యాదు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని ఇన్స్టాగ్రామ్
టాలీవుడ్లో మరో వివాదం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు బాలీవుడ్ నటి మీరాచోప్రా ఫిర్యాదు చేశారు. జూ.ఎన్టీఆర్ ఎవరో తెలియదని ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మీరాచోప్రా చెప్పడంతో వివాదం మొదలైంది. అప్పటినుంచి తనకు సోషల్ మీడియాలో వేధింపులు స్టార్ట్ అయ్యాయని, అసభ్యపదజాలంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనకు మెసేజ్‌లు చేశారని మీరా ఆరోపించారు. అంతేకాదు కొందరు అభిమానులు ఏకంగా బెదిరింపులకు కూడా దిగినట్టు చెప్పారు.
గ్యాంగ్ రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. కొంతమంది తనను పోర్న్ స్టార్, వేశ్య అంటూ కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నటి మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేసిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సైబర్ క్రైమ్ పోలీసులకు షేర్ చేశారు. ట్విట్టర్ వేదికగా తనను వేధిస్తున్న వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి అకౌంట్లు సస్పెండ్ చేయాలని పోలీసులను కోరారు. అలాగే ఫ్యాన్స్ తీరుపై ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు మీరాచోప్రా.
ఎన్టీఆర్ ఎవరో తెలియదు:
నిన్న మీరా చోప్రా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆస్క్ మీరా(#askmeera) అనే హ్యాష్ ట్యాగ్‌తో ఈ ఇంటరాక్టివ్ సెషన్ సాగింది. టాలీవుడ్లో ఇష్టమైన నటుడు ఎవరని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు పేరు చెప్పారు మీరా. ఎన్టీఆర్ గురించి చెప్పమని మీరాను నెటిజన్లు అడగగా.. నాకు అతని గురించి తెలియదని ఆమె తెలిపింది. దీంతో ఇంకో నెటిజన్ శక్తి, దమ్ము చూసి రిప్లై ఇవ్వమని అడిగాడు. దానికి, తనకు ఆసక్తి లేదని జవాబిచ్చింది మీరా. దీంతో నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారని మీరా ఆరోపించారు.
పోర్న్ స్టార్, వేశ్య అంటూ పోస్టులు:
సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్, దూషణలు తట్టుకోలేకపోయిన మీరా చివరకు పోలీసులను ఆశ్రయించారు. అలాగే తారక్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. మీ కన్నా మహేష్‌ని ఎక్కువగా అభిమానించినందుకు.. నన్ను అసభ్య పదజాలంతో మీ ఫ్యాన్స్ తిడుతున్నారు, వేధిస్తున్నారు.. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో మీరు సక్సెస్ అయ్యారని భావిస్తున్నారా? అంటూ మీరా ప్రశ్నించారు. ఈ ట్వీట్స్ పై ఎన్టీఆర్ స్పందిస్తారని ఆశిస్తున్నట్టు మీరా చెప్పారు.
Read: సోషల్ ను ఊపేస్తున్న నిహారిక..కవర్ మేగజైన్ కవర్ ఫొటో : దీనికి మించిన మోడరన్ అవతార్ లో ఐదు పిక్స్
