Nani 30 : నేచురల్ స్టార్ సినిమాకి క్లాప్ కొట్టిన మెగాస్టార్..
నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని మొదలు పెట్టేశాడు. టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా వరుస హిట్టులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 30వ సినిమాని మొదలు పెట్టాడు.
- gum 95921
- Published On : January 31, 2023 / 01:34 PM IST
Nani 30
Nani 30 : నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని మొదలు పెట్టేశాడు. టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా వరుస హిట్టులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 30వ సినిమాని మొదలు పెట్టాడు. ఇటీవల న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీని ప్రకటించిన నాని నేడు పూజ కార్యక్రమాలతో సినిమాకి క్లాప్ కొట్టాడు. ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు, నిర్మాత అశ్విని దత్ తో పాటు చిత్ర యూనిట్ మరియు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సీన్ కి క్లాప్ కొట్టగా, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పేపర్లు అందించాడు. నిర్మాత అశ్విని దత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హనురాఘవాపుడి మొదటి షాట్ కి దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ గా చేసి నాని మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు తండ్రి కూతుళ్ళ కథతో మరోసారి ఆడియన్స్ మనసులను తాకనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
కొత్త దర్శకుడు ‘శౌర్యువ్’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ హృదయం సినిమాకి సంగీతం అందించిన హేశం అబ్దుల్ వహాబ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. కొత్త నిర్మాణ సంస్థ అయిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనున్నారు చిత్ర యూనిట్. కాగా నాని తన తాజా మూవీ దసరా విడుదలకు సిద్ధమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ని నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.
And!?
Our #Nani30 Begins with a Mega clap ? by the Megastar @KChiruTweets❤️??VijayendraPrasad
? SwitchOn @AshwiniDuttCh
1st ShotDir: @hanurpudi,#KishoreTirumala, #VivekAthreya, @BucchiBabuSana,@DirVassishtaNatural?@NameisNani @mrunal0801 @shouryuv @HeshamAWMusic @VyraEnts pic.twitter.com/MyL2H2zHge
— Vyra Entertainments (@VyraEnts) January 31, 2023
