Pawan Kalyan MEGA 158 : మెగాస్టార్ చిరంజీవి 158వ మూవీ లాంచ్.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్
MEGA 158 - Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 21, 2026 / 11:47 AM IST
Mega Star Chiranjeevi MEGA158 Movie Opening Ceremony
MEGA 158 : మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. తాజాగా ఆయన కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరు కెరీర్‌లో 158వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజు (మే 21) గురువారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగబాబు, దర్శక నిర్మాతలు హాజరు అయ్యారు.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్.ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తరువాత చిరు, బాబీ కాంబినేషన్‌లో ఈ చిత్రం వస్తుండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
*Peddi : పెద్ది మూవీకి ఐబొమ్మ టెన్షన్..!?
