Paradise : ప్యారడైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరు.!?

హీరో నాని న‌టిస్తున్న చిత్రం ది ప్యారడైజ్(Nani). సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రి

Mega Star Chiranjeevi will be the chief guest for Nani Paradise Pre Release Event

Chiranjeevi : హీరో నాని న‌టిస్తున్న చిత్రం ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు కేవలం కొద్దిరోజులే ఉండటంతో ఇప్పుడు సినిమా టీమ్‌పై ఓ రేంజ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ ప్రెజర్‌ ఉందట. సినిమాకు సంబంధించిన కీలకమైన పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. సాధారణంగా రిలీజ్‌కు ముందు ఉండాల్సినంత స్థాయిలో ప్రమోషన్స్ చేయడానికి కూడా టైమ్ దొరకడం లేదనే చర్చ వినిపిస్తోంది.

ఒకవైపు సినిమా పనులు పూర్తి చేయాలి, మరోవైపు ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉండటంతో ప్యారడైజ్‌ టీమ్‌ ఫుల్ టైట్ షెడ్యూల్ లో ఇరుక్కుపోయిందట. అదంతా అలా నడుస్తున్నప్పటికీ.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్.

Pragya Jaiswal : గ్రీస్‌లో ర‌కుల్‌తో క‌లిసి ర‌చ్చ రచ్చ చేస్తున్న ప్ర‌గ్యాజైస్వాల్.. ఫోటోలు వైర‌ల్..

ప్యారడైజ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్‌గా గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నారట. మెగాస్టార్ రాకతో తక్కువ సమయంలోనే సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేయొచ్చని మేకర్స్ భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, చిరంజీవి హాజరవుతే మెగా ఫ్యాన్స్ కూడా సినిమాను తమ భుజాలపై వేసుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే అవకాశం ఉందనే టాక్ ఉంది. ప్రమోషన్స్‌కు టైమ్ తక్కువగా ఉన్న ఈ సమయంలో మెగాస్టార్ ఎంట్రీ పారడైజ్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.