HBD Kaikala Satyanarayana : నవరస నటనా సార్వభౌముడికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఇవాళ. ఈసందర్భంగా మెగాస్టార్  చిరంజీవి సతీ సమేతంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయనకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.

Kaikala Chirnajeevi

HBD Kaikala Satyanarayana :  నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు ఇవాళ. ఈసందర్భంగా మెగాస్టార్  చిరంజీవి సతీ సమేతంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయనకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈసందర్భంగా తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, నాకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని,ఈ రోజు నేను,  నా సతీమణితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అంటూ చిరంజీని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చిరంజీవి కైకాల సత్యనారాయణ కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. స్టేట్ రౌడీ, కొదమసింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యుముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.