Chiranjeevi: ఫిల్మ్ చాంబర్ నిర్ణయమే ఫైనల్.. అందరికీ న్యాయం జరుగుతుంది: మెగాస్టార్ చిరంజీవి

థియేటర్స్‌లో పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చాంబర్ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు చిరంజీవి.

Chiranjeevi meeting on single theaters issue

  • చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
  • మీడియా ముందు మాట్లాడటం తగదు.
  • జూన్ 30న నివేదిక వస్తుంది.

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యున్నత సంస్థ అయిన ‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎఫ్‌సీసీ) నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పిలుపునిచ్చారు. థియేటర్స్‌లో పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చాంబర్ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఎవరూ మాట్లాడకూడదని, దీనివల్ల ఇండస్ట్రీలో ఐక్యత లేదనే తప్పుడు సందేశం వెళ్తుందని ఆయన హితవు పలికారు.

Sridevi Vijaykumar: తండ్రీకూతుళ్ల క్యూట్ బాండింగ్.. తండ్రి విజయ్‌కుమార్‌తో శ్రీదేవి స్పెషల్ క్లిక్స్

మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్‌ స్క్రీన్లలో కూడా పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభంపై సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం చిరంజీవిని కలిసి చర్చించారు. గత కమిటీల పనితీరుపై కొందరు ఎగ్జిబిటర్లలో ఉన్న అసంతృప్తి, అపనమ్మకం గురించి తనకు అర్థమైందని చిరంజీవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఫిల్మ్‌ చాంబర్‌ కమిటీ జూన్‌ 30వ తేదీ లోపు అన్ని విషయాలను పరిశీలించి, అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజీ మోడల్‌పై ప్రతిపాదనలు తెస్తుందనే నమ్మకం తనకు ఉందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ సకాలంలో నివేదిక ఇచ్చేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ కీలక సమావేశంలో సురేష్‌బాబు, ‘దిల్‌’ రాజు, అల్లు అరవింద్, సునీల్‌ నారంగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.