#42YearsForMegaLegacy : ఆగస్టు 22, సెప్టెంబర్ 22 నా జీవితంలో మర్చిపోలేని రోజులు..
- sekhar
- Updated on- September 22, 2020 / 12:41 PM IST
#42YearsForMegaLegacy: ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. తన జీవితంలో సెప్టెంబర్ 22కు చాలా ప్రాధాన్యం ఉందంటూ చిరంజీవి సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ చేశారు.
చిరు సినీ రంగ ప్రవేశం చేసి నేటితో 42 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
#BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020
