Chiranjeevi : మలయాళ మూవీకి నో.. చిరంజీవి ఇకపై రీమేక్స్ చేయడట..!
ఇక రీమేక్స్ కి గుడ్ బై చెప్పేస్తున్న చిరంజీవి. రీసెంట్ గా ఒక నిర్మాతకు..
- gum 95921
- Published On : August 28, 2023 / 04:58 PM IST
Megastar Chiranjeevi said no more remakes from him
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఆరు సినిమాలు చేస్తే వాటిలో మూడు సినిమాలు రీమేక్ గా వచ్చాయి. ‘కత్తి’కి రీమేక్ గా ఖైదీ నెంబర్ 150, ‘లూసిఫర్’తో గాడ్ ఫాదర్, ‘వేదాళం’తో భోళాశంకర్. వీటిలో ఖైదీ నెంబర్ 150 తప్ప మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. నిజానికి అభిమానులకు ఈ రీమేక్స్ పై పెద్దగా ఆసక్తి లేకపోవడం వలనే ప్లాప్ గా నిలిచాయి. ప్రస్తుతం ఓటీటీ కల్చర్ అలవాటు అవ్వడంతో.. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేయడం, లేదా పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లు వాటిని తెలుగు లాంగ్వేజ్ లో కూడా అందుబాటులోకి తీసుకు రావడంతో చాలావరకు ప్రేక్షకులు చూసేస్తున్నారు.
Adah Sharma : ఆ హీరో సూసైడ్ చేసుకున్న ప్లాట్‌ను కొన్న అదాశర్మ..? క్లారిటీ ఇదే..!
ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ సినిమాలను రీమేక్ చేసి స్టార్ హీరోలు థియేటర్ లోకి తీసుకు వచ్చినా ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. అంతేకాకుండా పలు విమర్శలు కూడా ఎదురుకోవాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే, భోళాశంకర్ రిలీజ్ కి ముందు చిరంజీవి మరో రీమేక్ చేయబోతున్నాడంటూ ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది. వాటిలో ఎంత నిజం ఉందో అనేది తెలియదు.
Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికెళ్లి అభినందించిన బండారు దత్తాత్రేయ
అయితే తాజాగా ఒక నిర్మాత ఒక మలయాళ హిట్ మూవీ రీమేక్ రైట్స్ తీసుకోని చిరు దగ్గరకి వెళ్లగా.. తాను చేయని నిర్మొహమాటంగా చెప్పేశాడట. మరి చిరంజీవి రీమక్స్ పూర్తిగా దూరంగా ఉంటాడా..? లేదా ప్రస్తుతానికి గ్యాప్ ఇస్తున్నాడా..? అనేది చూడాలి. చిరు ప్రెజెంట్ ‘బింబిసార’తో హిట్ అందుకున్న వశిష్టతో తన 157వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్ నిర్మించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
