మంచు ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ సందడి

  • Publish Date - October 28, 2019 / 10:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి.. మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు. దివాళి సందర్భంగా మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి లువురు సినీ స్టార్స్ హాజరయ్యారు. డార్లింగ్ ప్రభాస్ విష్ణు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులిచ్చాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి విష్ణు కూతురు విద్యను ఆడిస్తూ హంగామా చేశారు. ‘మనందరికీ ఇష్టమైన చిరంజీవి అంకుల్‌కి మా కూతురు ఐరా విద్యను పరిచయం చేశాను’ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు విష్ణు. 

Read Also : పెదనాన్న ఇంట్లో పటాసులు పేల్చిన ప్రభాస్

ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా నవంబర్ రెండోవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.