పెదనాన్న ఇంట్లో పటాసులు పేల్చిన ప్రభాస్
రెబల్‌స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పటాసులు కాలుస్తూ హంగామా చేశాడు..

రెబల్‌స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పటాసులు కాలుస్తూ హంగామా చేశాడు..
రెబల్‌స్టార్ ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడు. మంచు ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్‌లో సందడి చేసిన డార్లింగ్.. రాత్రి (అక్టోబర్ 27) పెదనాన్న కృష్ణంరాజు ఇంటికి వెళ్లాడు.
అక్కడ జరిగిన దీపావళి సంబరాల్లో పార్టిసిపెట్ చేశాడు. కృష్ణంరాజు, ఆయన భార్య శ్యామలా దేవి.. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ పండుగ జరుపుకున్నాడు. అందరితో కలిసి పటాసులు కాలుస్తూ హంగామా చేశాడు.
Read Also : మంచు ఫ్యామిలీ దివాళీ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ సందడి
ప్రభాస్ దీపావళి వేడుకల ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. ‘సాహో’ తర్వాత ప్రభాస్, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) న్యూ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది.
#Prabhas celebrating Diwali with Pedananna Krishnam Raju garu and Peddamma #Syamala garu pic.twitter.com/WcTZKD7eLh
— BARaju (@baraju_SuperHit) October 28, 2019