Heart Attack With Fan: బాబోయ్.. ఫ్యాన్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెపోటు వచ్చే ప్రమాదం..! అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గాలిలో అధిక ఉష్ణోగ్రత మీ శరీరాన్ని మరింత వేడెక్కిస్తుంది. మీ శరీరంలో.. (Heart Attack With Fan)

Heart Attack With Fan: దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జూలై నెలలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు కొంత తగ్గినా.. తేమ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో చల్లగా ఉండటం గతంలో కంటే చాలా అవసరంగా మారింది. ఇందుకోసం ఎయిర్ కండిషనర్ అవసరం కావొచ్చు లేకపోవచ్చు.
అందరి ఇళ్లలో ఏసీలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఫ్యాన్ లేని ఇల్లు మాత్రం ఉండదు. వేడిని తగ్గించి ఇంటిని చల్లగా ఉంచటానికి ప్రతి ఇంట్లో ఫ్యాన్ మాత్రం ఉండాల్సిందే.
ఫ్యాన్ వేసుకుంటే చల్లదనం కలగడం మాట అటుంచితే.. ఈ విద్యుత్ పరికరాన్ని ఉపయోగించడం వల్ల మీ ఆరోగ్యానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ హానికరం అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని సిడ్నీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఉపయోగించినప్పుడు ఫ్యాన్ లు మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పరీక్షించడానికి ఒక చిన్న సమూహాన్ని నియమించారు.
ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, చెమట పట్టడం, సౌకర్య స్థాయిలను నోట్ చేసుకున్నారు. హైడ్రేషన్ స్థాయిలు ఏదైనా తేడాను కలిగి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఫ్యాన్ లు గుండెను ఎలా ఉత్తేజపరుస్తాయో అధ్యయనం చేశారు సైంటిస్టులు.
మునుపటి అధ్యయనాల ప్రకారం కొన్నిసార్లు వేడి ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయవచ్చు. 49 శాతం తేమతో 39.2°C కు సెట్ చేయబడిన వాతావరణ నియంత్రిత గదిలో ప్రయోగాన్ని నిర్వహించారు. మొత్తం నాలుగు సెషన్లు నిర్వహించగా, మొదటి రెండు సెషన్లలో, చాలా మంది బాగా హైడ్రేటెడ్ గా ఉన్నారు.
ట్రయల్ ప్రారంభానికి ముందు తరువాత నీరు, ద్రవాలు తాగారు. అయితే, మిగిలిన రెండు సెషన్లలో, కనీసం 24 గంటల పాటు అధిక నీటి శాతం ఉన్న ద్రవాలు ఆహారాలను నివారించడం ద్వారా వారు ఉద్దేశపూర్వకంగా డీహైడ్రేట్ చేయబడ్డారు.
ట్రయల్ సమయంలో తాగడానికి అనుమతి ఇచ్చారు. ప్రతి హైడ్రేషన్ స్థితిని ఫ్యాన్ ఉపయోగించి ఒకసారి లేకుండా మరోసారి పరీక్షించారు. శాస్త్రవేత్తలు వారి హృదయ స్పందన రేటు, మల ఉష్ణోగ్రత, మొత్తం శరీర చెమట రేటు, ఉష్ణ అసౌకర్యం, దాహం స్థాయిని కొలిచారు.
ఫలితాల ప్రకారం డీహైడ్రేషన్ సమయంలో ఫ్యాన్ వాడటం వల్ల గుండెపోటు వస్తుంది. ఫ్యాన్ వాడటం వల్ల చెమట స్రావం దాదాపు 60 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే మీరు డీహైడ్రేషన్‌కు గురైతే, ఫ్యాన్ కింద పడుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం.
”తీవ్రమైన వేడికి గురయ్యే చాలా మంది దగ్గర ఏసీలు ఉండకపోవచ్చు. కానీ, విద్యుత్ ఫ్యాన్లు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అయితే, వేడిగా ఉండే పరిస్థితుల్లో, ఫ్యాన్లను ఆపివేయాలి. ఎందుకంటే అవి వేడి ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తాయి” అని అధ్యయన నాయకుడు డాక్టర్ కానర్ గ్రాహం అన్నారు
డీహైడ్రేషన్ సమయంలో ఫ్యాన్ లు ఎందుకు ప్రమాదకరం?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గాలిలో అధిక ఉష్ణోగ్రత మీ శరీరాన్ని మరింత వేడెక్కిస్తుంది. మీ శరీరంలో అప్పటికే నీరు తక్కువగా ఉంటే, ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. 39°C వరకు ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఫ్యాన్ వాడకం గుండెపై ఒత్తిడిని తగ్గించినప్పటికీ, 40°C దాటిన తర్వాత, వాటిని ఆపివేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
హ్యుమిడిటీలో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోవడానికి మార్గాలు..
తేమతో కూడిన వాతావరణంలో మీ గుండెను జాగ్రత్తగా చూసుకోవడానికి పాటించాల్సినవి..
* ఎల్లప్పుడూ చల్లగా ఉండటంపై దృష్టి పెట్టండి
* ఎక్కువ నీరు తాగండి, హైడ్రేటెడ్ గా ఉండండి
* తీవ్ర వేడి సమయంలో కఠినమైన కార్యకలాపాల్లో పాల్గొనవద్దు
* ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలలో ఉండండి
* ఛాతి నొప్పి, తల తిరగడం లేదా అధిక చెమట వంటి హెచ్చరిక సంకేతాలను గుర్తించడం
* మీ ఇల్లు, కార్యాలయం లేదా పబ్లిక్ శీతలీకరణ కేంద్రాలు వంటి ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపండి.
మొత్తంగా మే నెలలో ఫ్యాన్ వేసుకుని నిద్రపోవడం ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ అది గుండె ఆరోగ్యానికి ప్రమాదాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం గాలి ప్రవాహం.. కండరాల దృఢత్వం, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది.
ఇది హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారికి, ఈ అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
Also Read: మీ పిలల్లకు తేనే తినిపిస్తున్నారా? చేతులు, కాళ్ళు పడిపోవచ్చు.. జాగ్రత్త సుమీ