No Look Sixes: ఎవరు బ్రో నువ్వు.. ఈ రేంజ్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టావ్.. కనీసం చూడకుండా..

ఈ యువ ఆటగాడు కొట్టిన షాట్లకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (No Look Sixes)

No Look Sixes: ఎవరు బ్రో నువ్వు.. ఈ రేంజ్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టావ్.. కనీసం చూడకుండా..

Updated On : August 16, 2025 / 10:03 PM IST

No Look Sixes: సౌతాఫ్రికా రైజింగ్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్ చెలరేగిపోతున్నాడు. బ్యాట్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. అతడు కొట్టే షాట్లు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా అతడు కొట్టిన సిక్సులు సూపరో సూపర్.

రెండో టీ20లో మెరుపు సెంచ‌రీతో చెల‌రేగిన బ్రెవిస్‌.. శనివారం కైర్న్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ, చివరి టీ20లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 26 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 భారీ సిక్సులు కొట్టడం విశేషం. కాగా, ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వరుసగా మూడు నో-లుక్ సిక్సర్లు బాదాడు.

డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన మూడు నో లుక్ సిక్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు.

వావ్ వాటే షాట్ అని నోరెళ్లబెడుతున్నారు. అతని షాట్ సెలక్షన్, స్టైల్ కు అభిమానులు మెస్మరైజ్ అయిపోయారు. ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేస్తున్నాడని కితాబిస్తున్నారు.

22 ఏళ్ల బ్రెవిస్.. లువాన్-డ్రే ప్రిటోరియస్ ఔటయ్యాక 4వ స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ యువ బౌలర్ ఆరోన్ హార్డీకి చుక్కలు చూపించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బ్రెవిస్ వరుసగా మూడు నో-లుక్ సిక్సర్లు బాదాడు.

హార్డీ వేసిన ఓవర్ లో మొదటి 2 బంతుల్లో కేవలం 2 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత బ్రెవిస్ గేర్ మార్చాడు. వరుసగా నాలుగు సిక్సులు బాది ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు.

ఆ ఓవర్ లోని మూడో బంతికి మిడ్-వికెట్ మీదుగా షార్టిష్ లెంత్ బాల్ వేయడంతో మారణహోమం మొదలైంది. బంతిని లాంగ్ ఆన్ ఫెన్స్ మీదుగా పంపాడు. (No Look Sixes)

ఆ ఓవర్ లోని ఐదవ బంతికి హార్డీ ఆఫ్ స్టంప్ వెలుపల ఓవర్ పిచ్ చేయగా, బ్యాటర్ దానిని లాంగ్ ఆఫ్ పైకి కొట్టాడు.

స్టేడియం బయట పడిన బంతి..

అంతకంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ బెన్ బౌలింగ్‌లో కూడా బ్రెవిస్ 100 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అతడి బ్యాట్ పవర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ఇది చూసి అంతా షాకయ్యారు.

ఈ యువ ఆటగాడు కొట్టిన షాట్లకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 12వ ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ లాంగ్ ఆన్‌లో తీసుకున్న క్యాచ్ తో బ్రెవిస్ ఔటయ్యాడు.

ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 172/7 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: రాజ‌స్థాన్‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన కేకేఆర్‌..! సంజూని ఇస్తే.. ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌తో పాటు..