KKR : రాజస్థాన్‌కు బంఫర్ ఆఫర్ ఇచ్చిన కేకేఆర్..! సంజూని ఇస్తే.. ఇద్దరు ఆటగాళ్లతో పాటు..
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)ప్రయత్నాలను మొదలుపెట్టిందట.

KKR offer to RR two players to swap for Sanju Samson
KKR : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడ్ అంశం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ భారత వికెట్ కీపర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపించగా, రాజస్థాన్ పెట్టిన షరతులతో ఆ జట్టు వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఇదే సమయంలో సంజూ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్రయత్నాలను మొదలుపెట్టిందట.
ఈ క్రమంలో సంజూను దక్కించుకునేందుకు ఓ మంచి ఆఫర్‌ను రాజస్థాన్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
సంజూకు బదులుగా ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Bob Simpson : ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ కన్నుమూత..
శాంసన్‌కు రూ.18 కోట్లు..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.18 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఈ క్రమంలో అతడిని బదిలి చేయాలంటే ఆ మొత్తానికి సరిపడే ప్లేయర్లనే ఆర్ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ సంజూను ఇచ్చేసి సీఎస్‌కే నుంచి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబెను తీసుకుంటామనే ప్రతిపాదనను సీఎస్‌కే ముందు ఉంచింది. అయితే.. తమ జట్టు నుంచి ఒక్క ప్లేయర్ ను వదులుకునేందుకు సీఎస్‌కే సిద్ధం లేదు.
ఇక ఇప్పుడు కోల్‌కతా మాత్రం అంగ్క్రిష్ రఘువంశీ, రమణ్‌దీప్ సింగ్ లను వదులుకోవడానికి సిద్ధ పడింది. రఘువంశీని రూ.3కోట్లు, రమణ్‌దీప్ సింగ్ రూ.4 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. అంటే వీరిద్దరి మొత్తం కలిపి రూ.7 కోట్లు మాత్రమే.
అంటే సంజూ శాంసన్‌ను కేకేఆర్ తీసుకుని వీరిద్దరిని బదిలి చేసినా కూడా రాజస్థాన్‌కు కేకేఆర్ రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంకోవైపు.. సంజూ శాంసన్‌ను దక్కించుకుని అతడిని వచ్చే సీజన్‌ను కెప్టెన్‌గా చేయాలన్నది కేకేఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
మరీ రాజస్థాన్ మాటేమిటి?
రాజస్థాన్ రాయల్స్ జట్టులో టాప్ ఆర్డర్‌లో పెద్దగా సమస్యలు లేవు. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ఆ జట్టులో ఫినిషర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో రమణ్‌దీప్, రఘువంశీలను తీసుకుని వీరిద్దరిలో ఒకరికి ఈ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో రమణ్‌దీప్ ఉపయుక్తమైన బ్యాటర్. దీంతో కేకేఆర్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే ఆర్ఆర్‌కు బాగుంటుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.