Kavitha: కవిత కొత్త పార్టీ పేరు ఇదే..? పసుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండా?
కార్మిక దినోత్సవం రోజైన మే 1న పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Kavitha
- కవిత పార్టీ పేరు TPJP?
- పసుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండా?
- కాగడా లేదా కళ్లజోడు గుర్తుపై ఫోకస్
Kavitha: ఈ ఏడాది మేలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారామె. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. నా మొదటి ఛాయిస్ సిద్ధిపేట.. రెండో ఛాయిస్ బోధన్ అని కవిత చెప్పారు. ఈ క్రమంలో కవిత పార్టీ పేరు ఇదే అన్న ప్రచారం జరుగుతోంది. కవిత తన పార్టీ పేరును TPJP గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నామకరణం చేసినట్లుగా సమాచారం. తన పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పిన కవిత.. అన్నట్లుగానే ఇప్పుడున్న తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చేస్తూ తెలంగాణ ప్రజా జాగృతి పార్టీగా నిర్ణయించారని తెలుస్తోంది. కార్మిక దినోత్సవం రోజైన మే 1న పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక పసుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ వెంట బీసీ ఓటు బ్యాంక్ ఉండేది. ఆ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకునేలా పసుపు టచ్ ఇస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో నడుస్తున్న చర్చ.
ఇక పార్టీ గుర్తుగా కాగడా లేదా కళ్లజోడు గుర్తుపై కవిత ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట, బోధన్.. ఈ రెండు చోట్ల నుంచి కవిత బరిలోకి దిగుతారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: లక్కీ ఛాన్స్ ఎవరికో..? తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ రేసు
