Asia Cup 2025 : ఆసియా కప్ 2025కి టీమ్ఇండియా కెప్టెన్ ఫిక్స్..! ఆ స్టార్ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ కాదుగదా జట్టులో చోటు కూడా కష్టమేనా?
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది.

Suryakumar Yadav To Lead India in Asia Cup 2025 report
Asia Cup 2025 : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలోనే టీమ్ఇండియా (Team India) బరిలోకి దిగనుందని సమాచారం. కాగా.. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాణించడంతో అన్ని ఫార్మాట్లలలో అతడికే నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌లోనూ సూర్యను తప్పించి గిల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుందనే వార్తలు వచ్చాయి.
అయితే.. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. ఇలాంటి సమయంలో కెప్టెన్సీ మారిస్తే జట్టులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని, సూర్య కెప్టెన్సీ రికార్డు కూడా బాగుండడంతో టీ20 ప్రపంచకప్ వరకు అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా సమాచారం.
Mohammed Shami : ‘కూతురిని పట్టించుకోదుగానీ..’ షమీ పై హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు..
ఆసియా కప్ 2025లో పాల్గొనే భారత జట్టును ఆగస్టు 19న ఎంపిక చేయనున్నారు. ఆ రోజున చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ముంబైలో జరగనున్న ఈ మీటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొననున్నాడు.
కాగా.. స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్ర చికిత్స చేయించుకున్న సూర్య ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. సమావేశం కోసం అతడు ముంబై వెళ్లనున్నాడు.
గిల్‌కు చోటు కష్టమేనా?
కెప్టెన్ కాకపోయినప్పటికి కూడా వైస్‌కెప్టెన్‌గా అయినా శుభ్‌మన్ గిల్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అయితే.. గిల్ కు వైస్ కెప్టెన్సీ సంగతి పక్కన ఉంచితే కనీసం జట్టులో అతడు చోటు దక్కించుకోవడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ రూపంలో ఓపెనింగ్ జోడి ఇప్పటికే సెట్ అయింది. దీంతో గిల్‌కు దారులు మూసుకుపోయానని అంటున్నారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్‌లో గొప్పగా రాణించిన యశస్వి జైస్వాల్‌తో పాటు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌లకు కూడా ఆసియా కప్‌లో చోటు దక్కడం కష్టమే. వీరిద్దరిని టీ20ల కంటే ఎక్కువగా టెస్టులపై దృష్టిసారించమని సెలక్టర్లు తెలిపినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆసియాకప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Gautam Gambhir : ఆసియా కప్ 2025 ముందు ఉజ్జయినిలో టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రత్యేక పూజలు..
టీమ్ఇండియా తరుపున సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 83 మ్యాచ్‌లు ఆడాడు. 38.2 సగటుతో 2598 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.