Bob Simpson : ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ కన్నుమూత..
ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ (Bob Simpson) కన్నుమూశాడు.

Former Australia captain and coach Bob Simpson passed away
Bob Simpson : ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ (Bob Simpson) కన్నుమూశాడు.
గత కొన్నాళ్లుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు.
1957లో దక్షిణాఫ్రికా పై టెస్టు మ్యాచ్ ద్వారా సింప్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొత్తంగా తన కెరీర్‌లో 62 టెస్టుల్లో 46.8 సగటుతో 4869 పరుగులు చేశాడు.
ఇందులో 10 సెంచరీలు, 27 అర్థశతకాలు ఉన్నాయి. రెండు వన్డేలే ఆడిన ఆయన 18 సగటుతో 36 పరుగులు చేశాడు.
1964లో ఇంగ్లాండ్ జట్టు పై 311 పరుగులు సాధించి టెస్టుల్లో ఆస్ట్రేలియా తరుపున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డులకు ఎక్కాడు. స్లిప్ ఫీల్డర్‌గానూ సింప్సన్ అదరగొట్టాడు. టెస్టుల్లో 110 క్యాచ్‌లు అందుకున్నాడు.
అంతేకాండోయ్ అతడు ఓ ఉపయుక్తమైన స్పిన్నర్. టెస్టుల్లో అతడు 71 వికెట్లు తీశాడు. 1964లో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 1968లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.
RIP to a true cricket legend.
A Test cricketer, captain, coach and national selector – Bob Simpson was a mighty figure in Australian cricket, giving everything to our game.
Cricket Australia extends our thoughts and sympathies to Bob’s family and friends. pic.twitter.com/U8yGeZNmCb
— Cricket Australia (@CricketAus) August 16, 2025
1977లో వరల్డ్ సిరీస్ క్రికెట్ సంక్షోభం సమయంలో 41 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించారు. వరల్డ్ సిరీస్ ఆడేందుకు చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు వెళ్లిపోవడంతో జట్టు బలహీనంగా మారింది. ఆ సమయంలో నాయకత్వ బాధ్యతలు అందుకున్న సింప్సన్ బలమైన జట్టును రూపొందించడంలో ఎంతో సాయం చేశాడు.
Mohammed Shami : ‘కూతురిని పట్టించుకోడుగానీ..’ షమీ పై హసీన్ జహాన్ మరోసారి సంచలన ఆరోపణలు..
ఆట నుంచి రిటైర్ అయిన తరువాత 1986 నుంచి 1996 మధ్య ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గానూ సేవలు అందించాడు. ఆయన మార్గనిర్దేశ్యంలో ఆసీస్ 1987 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. 1989లో యాషెస్ సిరీస్‌ను తిరిగి సొంతం చేసుకుంది. 1995లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది.