Harmanpreet Kaur : అందువల్లే ఆసీస్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. హర్మన్ ప్రీత్ కౌర్ కామెంట్స్ వైరల్
ఆసీస్తో రెండో టీ20 మ్యాచ్లో ఓటమిపై భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది.
INDW vs AUSW 2nd T20 Harmanpreet Kaur comments after India lost match to Australia
Harmanpreet Kaur : బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఆసీస్తో రెండో టీ20 మ్యాచ్లో తాము ఓడిపోయామని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. బ్యాటర్లు ఇంకాస్త బాధ్యతగా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడింది. కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతానికి 1-1తో సమమైంది.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్ (57 బంతుల్లో 88 పరుగులు), బెత్ మూనీ (39 బంతుల్లో 46 పరుగులు) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్ ఓ వికెట్ తీసింది.
Harmanpreet Kaur : చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ కౌర్.. మహిళల క్రికెట్లో ఏకైక ప్లేయర్..
అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ (36; 30 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతి మంధాన (31; 24 బంతుల్లో 4 ఫోర్లు), షెఫాలీ వర్మ (29; 23 బంతుల్లో 5 ఫోర్లు) లు రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో 164 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది.
ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ కౌర్ స్పందించింది. లక్ష్యఛేదనలో ఓ దశలో 126/4 తో పటిష్టంగా ఉన్న భారత్ ఆ తరువాత అనూహ్యంగా తడబడింది. 7 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. దీనిపై హర్మన్ మాట్లాడుతూ.. వేగంగా పరుగులు చేసే క్రమంలో ఒక్కొసారి ఇలా జరుగుతుందని తెలిపింది. బ్యాటర్లు ఇంకాస్త బాధ్యత తీసుకోని ఆడాల్సి ఉందని అంది. స్మృతి మంధానతో తన భాగస్వామ్యం ఎంతో కీలకమైందని చెప్పింది. కాగా.. స్మృతి ఔట్ కావడమే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అని అంది. మొత్తంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామంది. ఓటమి నిరాశ కలిగించిందని చెప్పింది.
ఇక ఈ మ్యాచ్లో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయని అంది. బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం లభించినప్పటికి కూడా వారిని భారీ స్కోరు చేయడం ఆపడం చాలా బాగుందని చెప్పింది. బ్యాటింగ్లో కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పామని అంది. ఏదీ ఏమైనప్పటికి ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను చేజించుకుంటామనే ధీమాను వ్యక్తం చేసింది.
