Chiranjeevi: సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి.. ఏం జరగనుంది..
సినీ కార్మికుల సమస్య రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Chiranjeevi
Chiranjeevi: సినీ కార్మికులు, నిర్మాతల మధ్య పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరింది. నిర్మాతలు, సినీ కార్మికులతో విడివిడిగా చిరంజీవి భేటీ కానున్నారు. నిర్మాతలు, ఫెడరేషన్ కార్మికుల మధ్య సయోధ్య కుదిరేలా చిరంజీవి ఇరువర్గాలతో మాట్లాడనున్నారు. సినీ కార్మికుల సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కొన్ని రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వేతనాలను 30శాతం పెంచాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. అయితే నిర్మాతలు అందుకు ఒప్పుకోవడం లేదు. కార్మికులు కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ పంచాయితీ చిరంజీవి వద్దకు చేరింది. కాగా, ఈ సమస్య పరిష్కారం కోసం గతంలోనే చిరంజీవి ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. తర్వాత చిరంజీవి దాన్ని ఖండించారు. అందులో నిజం లేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. ఉదయం తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో పాటు తెలుగు నిర్మాతలను కలవనున్నారు చిరంజీవి.
అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా చిరంజీవి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి రంగప్రవేశంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ కార్మికులు, నిర్మాతలు.
Also Read: స్టాలిన్ రీ రిలీజ్.. డేట్ ఇదే.. స్వయంగా చిరంజీవి అఫీషియల్ అనౌన్స్ మెంట్.
నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య సయోధ్య కుదిరే విధంగా చిరంజీవి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 13 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇవాళ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిర్మాతలు, సినీ కార్మిక నాయకులతో విడివిడిగా సమావేశం కానున్నారు మెగాస్టార్ చిరంజీవి.
సమ్మెకు పరిష్కారం కనుగొనే విధంగా చర్చలు జరపనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు, కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల గురించి తెలుసుకున్నారు చిరంజీవి. తాను అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆగస్ట్ నెలలో వద్దని, సమస్య తీరాకే షూటింగ్ అని చిరంజీవి అన్నట్లుగా సమాచారం.