Mohan Babu: పవర్ ఫుల్ రోల్ లో కలెక్షన్స్ కింగ్.. వెంకటప్పయ్య నాయుడు ఫస్ట్ లుక్ విడుదల

శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి మోహన్ బాబు(Mohan Babu) ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.

Mohan Babu first look released from Srinivasa mangapuram movie

  • శ్రీనివాస మంగాపురం సినిమాలో మోహన్ బాబు
  • వెంకటప్పయ్య నాయుడు ఫస్ట్ లుక్ విడుదల
  • వైరల్ అవుతున్న పోస్టర్

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే, ఆయన నేచురల్ స్టార్ నానితో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మునుపెన్నడూ కనిపించనంత కొత్త కనిపిస్తున్నాడు మోహన్ బాబు(Mohan Babu). ఇప్పుడు తాజాగా మరో క్రేజీ పాత్రను ఒకే చేశాడు మోహన్ బాబు.

Dacoit: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ మూవీ టీం.. ఫోటోలు వైరల్

అదే వెంకటప్పయ్య నాయుడు. RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఈ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. చాలా కాలం తరువాత మోహన్ బాబు -పెదరాయుడు టైపు లుక్ లో కనిపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మోహన్ బాబు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఈ పాత్ర చాలా పివర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఆ పాత్రలో మెహన్ బాబు కూడా అదరగొట్టేశారని టాక్. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.