Drishyam 3: దృశ్యం 3 ఫ్యాన్స్ కి షాక్.. సినిమా విడుదల వాయిదా
యుద్ధం కారణం వల్ల దృశ్యం 3(Drishyam 3) సినిమాను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 06:41 AM IST
Mohanlal Drishyam 3 movie release has been postponed.
Drishyam 3: మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం సినిమా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ లో వచ్చిన రెండు భాగాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం 3(Drishyam 3) కూడా వస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా విడుదల కోసం మలయాళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Mrunal Thakur: క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ఘాటు అందంతో చెంపేస్తోందిగా.. ఫొటోలు
కానీ, ఆ అభిమానులకు నిరాశ ఎదురయ్యే వార్తను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే విడుదలైన అధికారిక పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచినప్పటికీ.. ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితుల వల్ల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు అతిపెద్ద ఆదాయం వస్తుంది. అక్కడ నెలకొన్న అనిశ్చితి వల్ల థియేటర్ల వద్ద వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమా కావడంతో, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్టు సమాచారం. దీంతో, దృశ్యం 3 సినిమా కోసం చూస్తున్న ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.
