Mohanlal: థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ లాల్.. ‘దృశ్యం 3’ స్పెషల్ స్క్రీనింగ్ వీడియో వైరల్!
ప్రేక్షకుల ఆనందం చూసి థియేటర్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ లాల్(Mohanlal).
- V Santhosh Kumar
- Updated on- May 23, 2026 / 03:26 PM IST
Mohanlal sheds tears over the love audience is showering on Drishyam 3 at dubai
- ‘దృశ్యం 3’ మూవీ సూపర్ హిట్.
- దుబాయ్‌లో మోహన్ లాల్ ఎమోషనల్.
- తెలుగులోనూ భారీ రెస్పాన్స్ సొంతం.
Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, సంచలన దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సీక్వెల్ ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో రీమేక్ స్టార్‌గా పేరున్న వెంకటేష్ ఈసారి నో చెప్పడంతో, మలయాళ మూలాన్నే తెలుగులో నేరుగా (డైరెక్ట్) రిలీజ్ చేశారు. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్ చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Kiran Abbavaram: కొడుకు ‘హను’ బర్త్ డే.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం
ఈ సినిమా విడుదల సందర్భంగా దుబాయ్‌లో చిత్ర యూనిట్ ఒక స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోకు మోహన్ లాల్, మీనా, ఎస్తర్ స్వయంగా హాజరయ్యారు. థియేటర్ వద్దకు చేరుకున్న ఆయనకు అక్కడి ప్రేక్షకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మోహన్ లాల్(Mohanlal) ఎమోషనల్ అయ్యారు. థియేటర్ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుండటం, ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలను చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ వీడియో మరోసారి నిరూపించింది. ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో జీతూ జోసెఫ్ స్క్రీన్‌ప్లే మ్యాజిక్ చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.
Emotional 😔#Mohanlal Moved to Tears by Overwhelming Fan Response at #Drishyam3 Screening in Dubai 😞 pic.twitter.com/0WMpsDSnbT
— Always Bollywood (@AlwaysBollywood) May 23, 2026
