Theaters Strike : అప్పుడు పవన్ సినిమాకు.. ఇప్పుడు చరణ్ సినిమాకు.. థియేటర్స్ బంద్ అంటూ..

ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ సమయంలో కూడా మళ్ళీ థియేటర్స్ బంద్ అనే మాట వినిపిస్తుంది. (Movie Theaters)

  • Updated on- April 11, 2026 / 02:23 PM IST

Movie Theaters Planning Strike

Theaters Strike : గతంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కి ముందు థియేటర్స్ బంద్ చేస్తామంటూ హడావిడి జరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పర్సెంటేజీ, రెంటల్ సిస్టమ్ కి సంబంధించి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదంతో ఆ బంద్ చేస్తామని అన్నారు. కొన్ని థియేటర్స్ కొన్ని రోజులు బంద్ నిర్వహించాయి కూడా. పవన్ సినిమాని అడ్డుకోడానికి థియేటర్స్ బంద్ ప్లాన్ చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో.

అయితే ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ సమయంలో కూడా మళ్ళీ థియేటర్స్ బంద్ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పర్సెంటేజీ, రెంటల్ సిస్టమ్ కి సంబంధించే బంద్ చేయాలనుకోవడం గమనార్హం. అప్పుడు ఏపీలో థియేటర్స్ బంద్ అంటే ఇప్పుడు నైజాంలో థియేటర్స్ బంద్ చేయాలని అంటున్నారు. తెలంగాణలో మే 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని ప్రతిపాదన నడుస్తుంది.

Also See : ఫేవరేట్ హీరో రామ్ చరణ్ ని కలిసిన ఆనందంలో హీరోయిన్.. ఫొటోలు వైరల్..

ఇటీవల హైదరాబాద్ లోని ఓ 23 థియేటర్స్ పర్సెంటేజీ విధానంలో అయితేనే సినిమాలు మా థియేటర్స్ లో రిలీజ్ అవుతాయి, రెంటల్ విధానంలో అయితే మేము సినిమాలు రిలీజ్ చేయమని నోటీసులు జారీ చేసారు. అయితే ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ నిర్మాతలు ఒప్పుకోలేదు. నిర్మాతలు రెంటల్ సిస్టమ్ వైపుకే మొగ్గు చూపుతున్నారు.

ఈ సమస్య ఫిలిం ఛాంబర్ వరకు కూడా వెళ్ళింది. ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఈ సమస్యపై ఎలాంటి క్లారిటీ రాకపోతే థియేటర్స్ బంద్ చేయాలని పలువురు ఎగ్జిబిటర్లు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 30నే పెద్ది సినిమా రిలీజ్ అనౌన్స్ చేసారు. మరి ఆ సమయానికి థియేటర్స్ – నిర్మాతల సమస్య పరిష్కారమవుతుందా? థియేటర్స్ బంద్ ఆగుతుందా చూడాలి. లేదంటే పెద్ది సినిమాకు ఎఫెక్ట్ అవ్వడం ఖాయం.

Also Read : మీలాంటి అన్నయ్య ఉండాలని కల.. విజయ్ దేవరకొండపై రష్మిక చెల్లి ఎమోషనల్ పోస్ట్..

అయితే గతంలో హరిహర వీరమల్లు సినిమా సమయంలో, ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ సమయానికి కూడా ఒకే కారణంతో థియేటర్స్ బంద్ అనడం టాలీవుడ్ లో మరింత చర్చకు దారి తీస్తోంది.