Mrunal Thakur : చిరంజీవి Mega 157లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా..?
చిరంజీవి Mega 157లో మృణాల్ ఠాకూర్ నటించబోతుందా..? మేకర్స్ ఆల్రెడీ ఆమెను..
- gum 95921
- Published On : September 6, 2023 / 09:27 PM IST
Mrunal Thakur is heroine for Chiranjeevi Mega 157
Mrunal Thakur : సీతారామం సినిమాతో టాలీవుడ్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకున్న బాలీవుడ్ భామ ‘మృణాల్ ఠాకూర్’తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ మేకర్స్ తెగ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే.
Vaishnavi Chaitanya : ఆ ఇద్దరు హీరోల సినిమా ఛాన్స్ అందుకున్న వైష్ణవి.. నిజమేనా..?
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ అయితేనే న్యాయం చేయగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఆమెను సంప్రదించినట్లు కూడా ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో అన్నది తెలియదు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట.
Kaavaali Video Song : జైలర్ నుంచి ‘కావాలి’ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఒక లుక్ వేసేయండి..
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. చిరు గతంలో ‘అంజి’ సినిమాతో సోషియో బ్యాక్‌డ్రాప్ ని టచ్ చేశాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. మరి ఇప్పుడు ఈ Mega 157 చిరుకి హిట్ ఇస్తుందా..? అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే, చిరు కూతురు సుస్మిత కొణిదెల (Susmita Konidela) నిర్మాణంలో తెరకెక్కబోయే156వ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది అనేది తెలియడం లేదు.
