Krishna Reddy- Sandhya: పెళ్లి చేసుకున్న సీరియల్ నటుడు.. వేడుకగా ‘ముద్దమందారం’ ఫేమ్ కృష్ణారెడ్డి పెళ్లి

ముద్ద మందారం ఫేమ్ కృష్ణారెడ్డి సంధ్య(Krishna Reddy- Sandhya) పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mudda Mandaram Fame Krishna Reddy sandhya Wedding photos viral on social media

  • సంధ్య మెడలో మూడుముళ్లు వేసిన కృష్ణారెడ్డి
  • వేడుకగా జరిగిన కృష్ణారెడ్డి వివాహ మహోత్సవం
  • తరలివచ్చిన సీరియల్ నటులు

Krishna Reddy- Sandhya: తెలుగు బుల్లితెర నటుడు కృష్ణారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన సొంతూరైన బలభద్రపురంలో సంధ్య అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు నటీనటులు హరిత, జాకీ, పవన్ సాయి వంటి పలువురు సీరియల్ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘ముద్దమందారం’, ‘ముత్యమంతా ముగ్గు’ వంటి సీరియల్స్ తో గుర్తింపు పొందిన కృష్ణారెడ్డి, ప్రస్తుతం ‘జానకి పరిణయం’ సీరియల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Vishwambhara: రెండు పార్ట్స్ గా మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఒకే ఒక పోస్ట్ తో కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్

అయితే, కృష్ణారెడ్డి(Krishna Reddy- Sandhya) వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే 2023లో ఆయనకు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు బదులు సంధ్యను వివాహం చేసుకోవడంతో, పాత నిశ్చితార్థం రద్దయినట్లు స్పష్టమైంది. కారణాలేమైనప్పటికీ, తన కొత్త జీవితాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డికి అభిమానులు మరియు సహచర నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.