Ram Charan : రామ్ చరణ్ కూతురి బారసాల నేడే.. బంగారు ఊయల బహుమతిగా ఇచ్చిన అంబానీ!
రామ్ చరణ్ అండ్ ఉపాసనల కూతురు మెగా ప్రిన్సెస్ బారసాల నేడే. ఇక ఈ కార్యక్రమం కోసం అంబానీ దంపతులు బంగారు ఊయలను బహుమతిగా ఇచ్చారట.
- gum 95921
- Published On : June 30, 2023 / 06:57 AM IST
Mukesh Ambani gifted golden cradle for Ram Charan daughter Barasala function
Ram Charan : రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మినిచ్చి మెగా కాంపౌండ్ లో సంబరాలు తీసుకు వచ్చారు. మెగా ప్రిన్సెస్ తో మెగా పవర్ స్టార్ హాస్పిటల్ నుంచి బయటకి వస్తుండగా అభిమానులు పూల వర్షం కురిపించి తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక ఆ మెగా వారసురాలిని ఎప్పుడు చూస్తామా? తనకి ఏ పేరుని పెడుతున్నారు? అని చాలా మందిలో ఆసక్తి నెలకుంది. అయితే ఆల్రెడీ ఒక పేరు అనుకున్ననట్లు మొన్న ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ తెలియజేసిన సంగతి తెలిసిందే.
Ram Charan : వామ్మో.. కోటి రూపాయల వాచ్.. వైరల్ అవుతున్న రామ్ చరణ్ వాచ్.. అసలు ధర ఎంతో తెలుసా?
ఆ పేరుని పాప బారసాల నాడు తానే అందరికి తెలియజేస్తాను అని కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. కాగా ఆ బారసాల నేడేనట. మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఈరోజు ఘనంగా జరగనుంది. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరగనుంది, ఎవరెవరు హాజరుకాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, ఈ బారసాల వేడుక కోసం ఇండియన్ కుబేరుడు అంబానీ (Mukesh Ambani) దంపతులు.. బంగారు ఊయలని బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.
ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ ఈరోజు మెగా ప్రిన్సెస్ పేరుతో పాటు పేస్ ని కూడా రివీల్ చేస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా తన మనవరాలు మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా అధ్బుతంగా ఉందంటూ చిరంజీవి (Chiranjeevi) అందరికి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ పాప జాతకం వల్లే గత కొంత కాలంగా తమ ఇంటిలో అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నాయి అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
