Murali Mohan released Amaravathiki aahwanam movie teaser
Amaravathiki Aahwanam Teaser: శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. దర్శకుడు జీవీకే తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో భాగాంగానే ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత, నటులు మురళీ మోహన్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిర్మాత వెంకటేశ్వరరావు మా బావగారు. ఆయన అడగగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. చేసినప్పుడు తెలియలేదు కానీ, స్క్రీన్ మీద చూస్తుంటే కంటెంట్ బాగుందని అనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు.
Allu Arjun: మెగా ఫ్యామిలీని ఇలా చూడటం చాలా హ్యాపీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ.. అమరావతికి ఆహ్వానం సినిమా కోసం నేను ఫస్ట్‌టైమ్ పిచ్చివాడి పాత్ర చేశాను. ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా నచుతుంది. ఫ్యామిలీ, ఎంటర్ టైన్ మెంట్, హారర్ ఈ జానర్లకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాగే మా “అమరావతికి ఆహ్వానం(Amaravathiki Aahwanam Teaser)” సినిమాను ఉంటుంది అని నమ్ముతున్నాం అన్నారు.
ఇక నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. “అమరావతికి ఆహ్వానం” మూవీ టీజర్ బాగుంది. ఈ సినిమా కూడా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్’ అన్నారు.
అనంతరం నటులు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. అమరావతికి ఆహ్వానం సినిమా టీజర్ చాలా బాగుంది. కంటెంట్ చూస్తుంటే తప్పకుండా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది. మా గురువు దాసరి గారు చెప్పినట్లు చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ప్రాణం. దర్శకుడు జీవీకే సినిమాను చక్కగా తెరకెక్కించారు. నిర్మాతలు వెంకటేశ్వరరావు , శంకర్ రావుతో నాకు మంచి స్నేహం ఉంది. ఇక తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మాకు సినిమా ఇండస్ట్రీతో 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. సినిమాలు చేయాలంటే డబ్బులు కావాలని రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాం. అప్పుడే మురళీమోహన్ గారితో పరిచయం ఏర్పడింది. మా సంస్థలో ఇది ఆరవ సినిమా. హారర్ జానర్ లో అందరికీ నచ్చేలా మా సినిమాను నిర్మించాం. ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం” అన్నారు.
హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ.. “అమరావతికి ఆహ్వానం” సినిమా కోసం టీం అంతా ఒక ఫ్యామిలీగా కలిసి పని చేశాం. ఈ సినిమా మా ప్రొడ్యూసర్స్ కు సక్సెస్, డబ్బును తీసుకురావాలని కోరుకుంటున్నా. మా డైరెక్టర్ కు సినిమా మీదున్న ప్యాషన్ స్క్రిప్ట్ నెరేట్ చేసేప్పుడే తెలిసింది. హారర్ ఎలిమెంట్స్ తో పాటు మీకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది” అన్నారు.
డైరెక్టర్ జీవీకే మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ శంకర్ రావు గారి ప్రోత్సాహంతోనే ఈ సినిమా తీయగలిగాను. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం సినిమా చేసుకుంటూ వచ్చాం. వీఎఫ్ఎక్స్ దగ్గరే డిలే అయ్యింది. ఈ సినిమా నిర్మాతలకు, యూనిట్ సభ్యులకు, సపోర్ట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.
ఇక హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ.. మేము కలిసి గతంలో అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి, బిగ్ బ్రదర్ వంటి సినిమాలు చేశాం. ఇప్పుడు “అమరావతికి ఆహ్వానం” సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు అనుకున్న బడ్జెట్ లో సినిమా చేయడమే సగం సక్సెస్. అలా మా సినిమా కూడా అనుకున్న బడ్జెట్ లో, ఇన్ టైమ్ లో కంప్లీట్ చేశాం. సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో, అలా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చే సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.