AK 47: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ అవుట్.. ఎవర్ని ఫిక్స్ చేశారో తెలుసా?

యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ను ఆదర్శ కుటుంబం(AK 47) సినిమా నుంచి తొలగించిన మేకర్స్.

Music Director Harshavardhan Rameshwar Exits from Venkatesh, Trivikram movie

  • ఆదర్శ కుటుంబం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మార్పు
  • హర్షవర్ధన్ ప్లేస్ లో థమన్ ను తీసుకున్నారు
  • త్రివిక్రమ్ డెసిషన్ అంటూ కామెంట్స్

AK 47: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలు క్లాసిక్ హిట్స్‌గా నిలిచి ఇప్పటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉన్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ‘ఆదర్శ కుటుంబం: AK 47′(AK 47) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉండబోతోందని సినీ వర్గాల టాక్.

Allu Arjun: గ్లోబల్ హిట్ గ్యారంటీ.. అల్లు అర్జున్ ఫుల్ హ్యాపీ.. అంచనాలు పెంచుతున్న రత్న కుమార్ కామెంట్స్

ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదటగా ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన కొత్త తరహా మ్యూజిక్ అందిస్తారని అందరూ భావించారు. అయితే, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం హర్షవర్ధన్ ప్లేస్ లోకి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాలకు థమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.

నిజానికి త్రివిక్రమ్ సినిమాలకు థమన్ ఒక రకంగా ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. అరవింద సమేత నుంచి గుంటూరు కారం వరకు వీరిద్దరిది సక్సెస్ ఫుల్ జర్నీగా సాగుతోంది. వెంకటేష్ మార్క్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు తోడుగా థమన్ మ్యూజిక్ కూడా తోడైతే ‘ఆదర్శ కుటుంబం’ మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.