Idhayam Murali OTT: తమన్ కమెడియన్ గా నటించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. అస్సలు మిస్ అవ్వొద్దు..
Idhayam Murali OTT: తమన్ కమెడియన్ గా కీలక పాత్రలో నటించిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. (Thaman)
Thaman
Idhayam Murali OTT: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్పుడెప్పుడో 20 ఏళ్ళ క్రితం బాయ్స్ సినిమాలో నటించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇదయం మురళి అనే సినిమాలో నటించి మెప్పించాడు. తమన్ కమెడియన్ గా కీలక పాత్రలో నటించిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.
తమిళ హీరో అథర్వ మురళి హీరోగా ప్రీతీ ముకుందన్, మాళవిక మోహనన్, జోనిత గాంధీ, కాయదు లోహర్, నిహారిక NM హీరోయిన్స్ గా తమన్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన తమిళ సినిమా ‘ఇదయం మురళి’. తెలుగులో ఈ సినిమాని హృదయం మురళిగా రిలీజ్ చేసారు. తమిళ్ లో జులై 10న, తెలుగులో జులై 11న ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది.
Also Read : నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. కాబోయే భర్తతో ఫొటోలు..
ఇదయం మురళి సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్ భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఒక 90s అబ్బాయి తన ప్రేమని చెప్పలేక వదులుకున్న ప్రేమకథలతో ఈ సినిమాని లవ్ కామెడీ జానర్ లో తెరకెక్కించారు.
ఈ సినిమాలో తమన్ డాక్టర్ పాత్రలో కనిపిస్తాడు. తమన్ సీన్స్ ఫుల్ గా నవ్విస్తాయి. తమన్ కి సపరేట్ లవ్ ట్రాక్ కూడా ఉంది. ఆ లవ్ ట్రాక్ కూడా ఎమోషనల్ గా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నటుడిగా మారి ఈ సినిమాతో మెప్పించాడు. చాలా సీన్స్ లో ఫుల్ గా నవ్విస్తాడు. ఈ సినిమా తర్వాత తమన్ కి నటుడిగా అవకాశాలు కూడా వస్తున్నాయట. తమన్ ఈ సినిమాలో నటించడమే కాక ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ఇవ్వడం గమనార్హం. బయట ఈవెంట్స్, టీవీ షోలలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అందర్నీ నవ్వించే తమన్ ఈ సినిమాలో కూడా చాలా బాగా నవ్వించాడు. ఓటీటీలో ఈ ఇదయం మురళి సినిమా మిస్ అవ్వకండి.
View this post on Instagram
