×
Ad

MMM: మళ్ళీ తమిళ హీరోతో.. మైత్రి కొత్త సినిమా.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

తమిళ స్టార్ ధృవ్ విక్రమ్ తో సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్(MMM).

Mythri Movie Makers making a movie with tamil hero Dhruv Vikram

MMM: టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్(MMM) ఒకటి. చిన్న, పెద్ద హీరోలు అని సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ టాప్ పొజిషల్ లో ఉంది ఈ సంస్థ. మైత్రి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అందులో మ్యాటర్ ఉంటుంది అనే రేంజ్ లో ఫేమ్ తెచ్చుకుంది ఈ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తోంది.

మరోపక్క టైర్ 2 హీరోలతో సైతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది ఈ మైత్రి సంస్థ. అయితే, కేవలం తెలుగులోనే కాదు తమిళ హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ, ప్రదీప్ రంగనాథం తో డ్యూడ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తమిళ హీరోతో క్రేజీ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఈ సంస్థ. ఆ హీరో మరెవరో కాదు ధృవ్ విక్రమ్.

Polimera 3: పొలిమేర 3లో కన్నడ స్టార్ హీరో.. ఈసారి పాన్ ఇండియా లెవల్లో.. అంచనాలు పెంచేస్తున్న టీం

మానసనమహ అనే షార్ట్ ఫిలిం చేసిన దర్శకుడు దీపక్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు అని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇటీవలే ధృవ్ విక్రమ్ కి కథను వినిపించగా ఆయన కూడా ఒకే చెప్పేశాడట. రోమ్-కామ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల, రుక్మిణి వసంత హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఈ ప్రాజెక్టుపై రానుంది.

అయితే, హీరో తమిళ్ ఇండస్ట్రీకి చెందినప్పటికీ పక్కా తెలుగు సినిమాలాగే తెరకెక్కనుందట ఈ మూవీ. ఫిబ్రవరి ఎండింగ్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి 2026 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. మరి ధృవ్ విక్రమ్ చేస్తున్న ఈ డైరెక్ట్ తెలుగు మూవీ ఆయనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుంది అనేది చూడాలి.