ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ మెలోడి

నా కళ్ళు చూసేది నీ కలనే, నా మనసు మోసేది నీపై ఊహలనే అనే మెలోడి ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

  • Publish Date - January 24, 2019 / 06:23 AM IST

నా కళ్ళు చూసేది నీ కలనే, నా మనసు మోసేది నీపై ఊహలనే అనే మెలోడి ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

యంగ్ హీరో సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని, నందిత శ్వేత మెయిన్ లీడ్స్‌గా, హరి కిషన్ డైరెక్షన్‌లో, ఆర్‌పి‌ఏ బ్యానర్‌పై, ఆర్.సుదర్శన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ,  ప్రేమకథా చిత్రమ్2… జేబీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన మెరుపులా మెరిసిన చిరునవ్వా అనే ఫస్ట్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా 
ఈ సినిమా నుండి, ఒక బ్యూటిఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

నా కళ్ళు చూసేది నీ కలనే, నా మనసు మోసేది నీపై ఊహలనే అనే మెలోడి ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ అందమైన లిరిక్స్ రాయగా, సత్య యామిని అంతే అద్భుతంగా పాడింది.  త్వరలో ప్రేమకథా చిత్రమ్2 రిలీజ్ కానుంది. ఈ సినిమాకి కెమెరా : సి.రామ్ ప్రసాద్, లిరిక్స్ : అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్.

వాచ్ నా కళ్ళు చూసేది నీ కలనే సాంగ్…