Darling : న‌భాన‌టేష్‌ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా న‌టించిన మూవీ డార్లింగ్‌.

Darling : న‌భాన‌టేష్‌ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Nabha Natesh Darling ott streaming date fix

Darling OTT Release : ప్రియదర్శి, నభా నటేష్ జంటగా న‌టించిన మూవీ డార్లింగ్‌. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. హనుమాన్ సినిమా నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్ప్లిట్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిశ్ర‌మ స్పంద‌న‌ను అందుకుంది.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి శుభ‌వార్త అందింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా స్ట్రీమింగ్ తేదీ ఫిక్సైంది. ఆగ‌స్టు 13 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Kalki 2898 AD : సినీ ప్రియుల‌కు శుభ‌వార్త‌.. వారం రోజుల పాటు రూ. 100కే ‘కల్కి’ టికెట్‌..

కథ : రాఘవ్(ప్రియదర్శి) చిన్నప్పట్నుంచి బాగా చదివి, సంపాదించి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హానీమూన్ కి పారిస్ వెళ్లాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో సైకాలజిస్ట్ నందిని(అనన్య నాగళ్ళ)తో పెళ్లి ఫిక్స్ అయినా పెళ్లి రోజు నందిని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోవడంతో దీంతో రాఘవ్ చనిపోవాలని డిసైడ్ అయి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఆనంది(నభా నటేష్) పరిచయమయి తన ఆలోచనలు మార్చి రాఘవ్ సూసైడ్ చేసుకోకుండా ఆపుతుంది. దీంతో రాఘవ్ ఆనందికి ప్రపోజ్ చేసి వెంటపడి ఆమెని అదే రోజు పెళ్లి చేసుకుంటాడు.

పెళ్లి అయిన మొదటి రాత్రే ఆనందిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేస్తే చితక్కొడుతుంది. ఆ తర్వాత రోజూ భార్య చేతిలో దెబ్బలు తింటున్న రాఘవ్ నందిని సాయంతో ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలుసుకుంటాడు. అయితే అది పోగొట్టే క్రమంలో ఆనంది సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. కానీ తృటిలో తప్పి హాస్పిటల్ లో చేరగా ఆమెకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని తెలియడంతో రాఘవ్ మరింత షాక్ అవుతాడు. అసలు ఆనంది ఎవరు? ఆనంది లోపల ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎవరు? వాళ్ళు ఎందుకొచ్చారు? రాఘవ్ ప్యారిస్ కల నెరవేరిందా? నందిని రాఘవ్ కి ఎలా సహాయం చేసింది? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

CM Revanth Reddy : సీఎంని కలిసిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు.. అమెరికా నుంచి వచ్చాక ఇండస్ట్రీతో మీటింగ్ పెడతాను..