CM Revanth Reddy : సీఎంని కలిసిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు.. అమెరికా నుంచి వచ్చాక ఇండస్ట్రీతో మీటింగ్ పెడతాను..

తాజాగా నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడు భరత్ భూషణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

CM Revanth Reddy : సీఎంని కలిసిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు.. అమెరికా నుంచి వచ్చాక ఇండస్ట్రీతో మీటింగ్ పెడతాను..

Telugu Film Chamber of Commerce President Meets CM Revanth Reddy

Updated On : August 1, 2024 / 4:46 PM IST

CM Revanth Reddy : ఇటీవల తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. భరత్ భూషణ్ ప్రసిడెంట్ గా ఎన్నికయ్యాకే సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ పై తెలుగు సినీ పరిశ్రమ స్పందించట్లేదు అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు, తెలుగు నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించాయి.

తాజాగా నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడు భరత్ భూషణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలతో పాటు గద్దర్ అవార్డ్స్ గురించి కూడా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భరత్ భూషణ్ గారికి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు. నా అమెరికా పర్యటన నుంచి వచ్చాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడతాను అని తెలిపారు.

Also Read : Squid Game 2 : సూపర్ హిట్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 రిలీజ్ ఎప్పుడంటే..? సీజన్ 3 కూడా..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం భరత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ లో ఉన్నా నన్ను కలిసి పరిశ్రమ గురించి మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇండస్ట్రీ సమస్యలకు సహకారం అందిస్తానని సీఎం చెప్పినట్టు తెలిపారు. దీంతో సీఎం మీటింగ్ పెట్టి ఏం మాట్లాడతారు, గద్దర్ అవార్డ్స్ గురించేనా? ఇంకేదైనా విషయాలపై తెలుగు పరిశ్రమతో చర్చిస్తారా అని చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.