Nabha Natesh Brother : నభా నటేష్ తమ్ముడ్ని చూశారా? సిక్స్ ప్యాక్‌తో హీరోలా ఉన్నాడుగా..

తాజాగా నభా నటేష్ తన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ పోస్ట్ చేసింది.

Nabha Natesh Brother : నభా నటేష్ తమ్ముడ్ని చూశారా? సిక్స్ ప్యాక్‌తో హీరోలా ఉన్నాడుగా..

Nabha Natesh Shares her Brother Nahusha Chakravarthi Six pack Photos its goes viral

Updated On : July 12, 2024 / 5:16 PM IST

Nabha Natesh Brother : నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్.. లాంటి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ యాక్సిడెంట్ కావడంతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇప్పుడు త్వరలో డార్లింగ్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయింది నభా. ఓ పక్క సినిమాలతో మరో పక్క సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్.

Also Read : Bharateeyudu 3 : భారతీయుడు 3 స్టోరీ అదేనా? ఫ్లాష్ బ్యాక్ తో.. కాజల్, కమల్ హాసన్ యుద్ధ వీరులుగా..

తాజాగా నభా నటేష్ తన తమ్ముడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ పోస్ట్ చేసింది. నభా తమ్ముడు నహుషా చక్రవర్తి ఫోటోలు షేర్ చేస్తూ తమ్ముడికి స్పెషల్ గా విషెష్ చెప్పింది. దీంతో నభా నటేష్ తమ్ముడి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందుకు కారణం నభా తమ్ముడు నహుషా సిక్స్ ప్యాక్ తో, జిమ్ బాడీతో అదిరిపోయే లుక్స్ లో హీరోలా ఉన్నాడు. దీంతో నభా తమ్ముడు హీరోలా ఉన్నాడు అంటూ ఆశ్చర్యపోతూ ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

ఇన్నాళ్లు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తే నార్మల్ ఫోటోలు షేర్ చేసిన నభా ఇప్పుడు తమ్ముడు సిక్స్ ప్యాక్ ఫోటోలు షేర్ చేయడంతో తమ్ముడ్ని కూడా సినిమాల్లోకి తీసుకొస్తుందా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి నభా తమ్ముడు నహుషా మాత్రం తన సిక్స్ ప్యాక్, జిమ్ బాడీతో వైరల్ అవుతున్నాడు.