తమ్ముడికి ‘హలో’.. అన్నకి ‘థ్యాంక్యూ’..

అక్కినేని నాగ చైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో సినిమా..

  • Publish Date - March 6, 2020 / 12:27 PM IST

అక్కినేని నాగ చైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో సినిమా..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని ఫిలింనగర్ టాక్. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన విక్రమ్.. తర్వాత అఖిల్ హీరోగా ‘హలో’ చిత్రం చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది.

విక్రమ్ ప్రతి సినిమాలోనూ ఏదో స్ట్రాంగ్ పాయింట్ తీసుకుని తనదైన శైలిలో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంటాడు. చైతు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ డిఫరెంట్ స్టోరి రెడీ చేసి వినిపించగా చైతు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మనం’ తర్వాత వీళ్ల కాంబోలో రానున్న రెండో సినిమా ఇది.

ఈ మూవీ కోసం ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ఫిలించాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం. చైతు ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ‘లవ్‌స్టోరి’ సినిమా చేస్తున్నాడు. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రకటించారు. విక్రమ్, చైతన్యల కలయికలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 

ట్రెండింగ్ వార్తలు