Naga Chaitanya – Mahesh Babu: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన అభిమాన హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు కటౌట్‌కి పాలాభిషేకం చేశాడు.. తన ఫేవరెట్ హీరో నటించిన బ్లాక్‌బస్టర్ ‘ఒక్కడు’ మూవీలోని మహేష్ భారీ కటౌట్‌పైకి ఎక్కి ఈలలతో, చప్పట్లతో గోల గోల చేశాడు. చైతు ఈ హడావిడి చేసింది తన కొత్త సినిమా కోసం అన్నమాట..
These two pics are from the sets of #ThankYouTheMovie ❤️@chay_akkineni ?
Meaning of Versatality ! pic.twitter.com/bLsUSEsE3T— Trends NagaChaitanya ™ (@TrendsChaitu) March 6, 2021
‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం “థ్యాంక్యూ”.. నాగ చైతన్య 20వ సినిమా ఇది. రైటర్ కమ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి కథ, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో చైతన్య, మహేష్ బాబు అభిమానిగా, అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించనున్నాడు.
‘ఒక్కడు’ సినిమా విడుదల సందర్భంగా తన అభిమాన హీరో కటౌట్ ఓపెన్ చేసి, పాలాభిషేకం చేసి సందడి చెయ్యగా, మిగతా ఫ్యాన్స్ అందరూ సూపర్‌స్టార్‌కి జై కొట్టారు. ఈ హడావిడి అంతా రాజమహేంద్రవరం లోని అశోక థియేటర్ వద్ద జరిగింది. ఈ హాలులో హీరో హీరోయిన్లపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.