Naga Chaitanya Should Do Massive Promotions For Custody Movie
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా కాప్ డ్రామాగా ఈ మూవీని చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో చైతూ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Naga Chaitanya : ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను..
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ కావడంతో, ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్. కానీ, సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఈ సినిమాకు తొలిరోజునే అట్టర్ ఫ్లాప్ ముద్రను వేశారు. ఇక ఇప్పుడు చైతూకి ఇలాంటి రిజల్ట్ రాకూడదంటే, ఆయన ఖచ్చితంగా కస్టడీ మూవీని జనంలోకి తీసుకెళ్లాల్సిందే.
Naga Chaitanya – Akhil : మాస్ ఇమేజ్ కోసం అన్నదమ్ముల పోరాటం.. ఈసారి వచ్చేనా?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ కాప్ డ్రామా మూవీలో కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నా.. సినిమాను జనంలోకి తీసుకెళ్లడంలో వెనకబడిపోతే మాత్రం ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాదు. అందుకే ఈ సినిమాను విస్తృతంగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.