Kantara : వరుస మరణాలు, ప్రమాదాలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కాంతార నిర్మాత..

కాంతార యూనిట్ కి ఈ సినిమా షూటింగ్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

Kantara : వరుస మరణాలు, ప్రమాదాలు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కాంతార నిర్మాత..

Kantara

Updated On : August 13, 2025 / 10:07 AM IST

Kantara : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార సినిమాతో 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ప్రస్తుతం ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే కాంతార యూనిట్ కి ఈ సినిమా షూటింగ్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఓ సారి నదిలో పడవ ప్రమాదం జరిగింది, ఈ మూవీలో నటించిన నలుగురు వరుసగా నెల రోజుల గ్యాప్ తో మరణించారు. ఈ సినిమాలో నటించిన దున్నపోతు మరణించింది.

దీంతో కాంతార సినిమా పంజుర్లి అమ్మవారికి చెందింది కాబట్టి షూటింగ్ లో ఏదైనా తప్పు చేసి ఉంటారు, అందుకే ఇలా జరుగుతుందని, ఏవో కొన్ని శక్తులు మూవీ యూనిట్ కి అడ్డు పడుతున్నాయని ప్రచారం సాగింది. వరుస మరణాలు, సెట్ లో జరుగుతున్న ప్రమాదాలు అన్ని ఈ ప్రచారాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే వీటిపై కాంతార సినిమా నిర్మాత చలువే గౌడ స్పందించారు.

Also Read : Drunk & Drive : డ్రంక్ & డ్రైవ్ లో పోలీసులు ఆపితే కార్ వదిలేసి పారిపోయిన నటుడు.. తెల్లారి పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే..

తాజాగా నిర్మాత చలువే గౌడ మీడియాతో మాట్లాడుతూ.. మా సినిమాపై జరుగుతున్న ప్రచారాల్లో నిజం లేదు. కొన్ని ప్రమాదాలు జరిగినా ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు. మరణించిన వారు కూడా వివిధ కారణాలతో బయటే మరణించారు. నదిలో పడవ మునిగిన ఘటనలో సాంకేతిక పరికరాలు మాత్రమే నష్టపోయాం. ఎవరికీ ఏమి కాలేదు. దయచేసి ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దు. సినిమా మొదలయ్యేముందు పంజుర్లి అమ్మవారిని దర్శించుకొని మొదలుపెట్టాము. కొన్ని అడ్డంకులు వచ్చినా ఆ అమ్మవారి దయతో షూటింగ్ పూర్తిచేసాము. ఇప్పుడు ఫుటేజ్ చూసాక సంతృప్తిగానే ఉన్నాము అని తెలిపారు.