×
Ad

Naga Chaitanya: మరో క్రేజీ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్.. నాగ చైతన్య లైనప్ మాములుగా లేదుగా!

వృషకర్మ తరువాత క్రేజీ సినిమా చేస్తున్న నాగ చైతన్య.

Naga Chaitanya to do a film with director Tarun Bhaskar

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. కానీ, సరైన కథలను, దర్శకులను ఎంచుకోవడంలో విఫలం అయ్యాడు. అయితే, తండేల్ సినిమాతో ఆయన తన రూట్ ను కంప్లీట్ గా మార్చేశాడు. తండేల్ ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే, ఆ తరువాత సినిమాలతో కూడా అదే హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మతో వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు కూడా బాగానే ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ సినిమా విడుదల కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

AA23: అల్లు అర్జున్ ను కలిసిన లోకేష్.. AA23 గురించి క్రేజీ అప్డేట్

అయితే, ఈ సినిమా తరువాత కూడా మరో క్రేజీ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాగ చైతన్య(Naga Chaitanya). ఆ దర్శకుడు మరెవరో కాదు తరుణ్ భాస్కర్. అవును, తరుణ్ భాస్కర్ చాలా కాలం నుంచి సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంటూ వస్తోంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పట్టాలెక్కించాలని చుస్తున్నాడట నిర్మాత సురేష్ బాబు. అందుకోసం నాగ చైతన్యను హీరోగా అనుకున్నాడట. దీనికి సంబంధించి కథను సిద్ధం చేయాల్సిందిగా తరుణ్ భాస్కర్ కు చెప్పాడట సురేష్ బాబు.

తాను కూడా ఒకే చెప్పేశాడట. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమయ్యింది 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఇపప్టికే షూటింగ్ మొదలైన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాగ చైతన్య ప్రాజెక్టుపై కూర్చోనున్నాడట తరుణ్ భాస్కర్. ఇక ఉగాది సందర్బంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా మొదలుపెట్టాలని చూస్తున్నారట మేకర్స్. మరి నాగ చైతన్య, తరుణ్ భాస్కర్ లాంటి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.