×
Ad

Naga Shaurya: “కృష్ణ వ్రింద విహారి” సరికొత్త ప్రమోషన్స్.. నాగశౌర్య పాద యాత్ర!

'అలా ఎలా', 'లవర్', 'గాలి సంపత్' సినిమాలు తెరకెక్కించిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం "కృష్ణ వ్రింద విహారి". సినిమాని సాధ్యమైనంత వరకు ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య.. ఈ క్రమంలోనే "కృష్ణ వ్రింద విహారి టీం..

  • Published On : September 13, 2022 / 05:08 PM IST

Naga Shaurya Different Promotions for his New Movie Krishna Vrinda Vihari

Naga Shaurya: ‘అలా ఎలా’, ‘లవర్’, ‘గాలి సంపత్’ సినిమాలు తెరకెక్కించిన అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగశౌర్య ఈ సినిమాతో ఎలైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Naga Shaurya : టాలీవుడ్ యువ హీరో ఇంట పెళ్లి బాజాలు.. సోదరుడి పెళ్ళికి హాజరు కానీ హీరో..

సినిమాని సాధ్యమైనంత వరకు ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు నాగశౌర్య.. ఈ క్రమంలోనే “కృష్ణ వ్రింద విహారి టీం పాద యాత్ర” అంటూ సరికొత్త ప్రమోషన్స్ తో ఆడియన్స్ కి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాదయాత్రకి సంబంధించిన రోడ్ మ్యాప్ ని కూడా మూవీ టీం విడుదల చేసింది. ఈ నెల 14న ఈ పాదయాత్ర తిరుపతి నుంచి మొదలుకాబోతుంది.

అక్కడి నుంచి 15 తారీఖు నెల్లూరు, 16న విజయవాడ-గుంటూరు-ఏలూరు, 17న భీమవరం-రాజమండ్రి, 18న కాకినాడ-వైజాగ్ లో ఈ పాదయాత్ర ముగియనుంది. ఇటువంటి యాత్రలు కేవలం రాజకీయంలోనే చూస్తుంటాం, కానీ మొదటిసారిగా ఇలా ఒక సినిమా ప్రమోషన్స్ లో చూస్తున్నాం. ‘ఛలో’ తరువాత సరైన హిట్ లేని నాగశౌర్యకి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Naga Shaurya Different Promotions for his New Movie Krishna Vrinda Vihari