Nagababu : అయిదేళ్లుగా నా కొడుకు బాధను మోస్తున్నాడు.. వరుణ్ తేజ్ పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్..
తాజాగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాని నాగబాబు చూసి వరుణ్ పై ఎమోషనల్ పోస్ట్ చేసాడు.(Nagababu)
- Saketh U
- Published on- August 9, 2026 / 04:42 PM IST
Nagababu
Nagababu : వరుసగా ఫ్లాప్స్ చూస్తున్న వరుణ్ తేజ్ తాజాగా కొరియన్ కనకరాజు సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. హారర్ యాక్షన్ గా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల రిలీజయి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులను ఫుల్ గా నవ్విస్తుంది ఈ సినిమా. గత కొన్నేళ్లగా ఫ్లాప్స్ చూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హిట్ కొట్టడంతో మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, టాలీవుడ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాని నాగబాబు చూసి వరుణ్ పై ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
Also Read : Tara Sutaria : బాబోయ్.. టాక్సిక్ ఈవెంట్ కోసం అందాలు ఆరబోస్తూ తరలివచ్చిన తార సుతారియా..
నాగబాబు తన పోస్ట్ లో.. ఐదేళ్లు నేను అన్నీ దగ్గరుండి చూశాను. నా కొడుకు ఆ నిశ్శబ్దాన్ని, బాధను, నిరాశలను మోశాడు. కానీ ప్రయత్నించడం మాత్రం ఆపలేదు. అతని ఖాతాలో ఒక్క విజయం కూడా లేదు, కేవలం అతన్ని పరీక్షించే వైఫల్యాలే మిగిలాయి. అతను బయటకు చెప్పకపోయినా, ఆ బాధ ఎంత తీవ్రంగా ఉండేదో నాకు తెలుసు. మేము మౌనంగానే ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళం. కొన్నిసార్లు మాటలు లేకుండానే అవతలి వ్యక్తి మనసులో ఏముందో మాకు అర్థమయ్యేది. అతనిలోని పోరాట పటిమను, అతను నిలుపుకున్న ఆశను, అలాగే అతను ముందుకు సాగుతూ వచ్చిన విధానాన్ని నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను.
ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు ఈ రోజు పరిస్థితులు అనుకూలించాయి. ఇది అద్భుతమైన విజయం.
ఈ విజయం పూర్తిగా అతనిదే. అతని పోరాటం, అతని సహనం, అతని కఠోర శ్రమ ఫలితం ఇది. నేను ఎప్పుడూ అతని కెరీర్ విషయంలో జోక్యం చేసుకోలేదు లేదా ఏ విజయానికీ క్రెడిట్ తీసుకోలేదు. అతని వైఫల్యాలు అతనివే, అలాగే ఈ రోజు దక్కిన ఈ విజయం కూడా పూర్తిగా అతనిదే. నా చిన్నారి వరుణ్ తేజ్ అభినందనలు బంగారు. నీ గురించి నాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే గాంధీ మేర్లపాక, సత్య, రితికా నాయక్, నిర్మాత రాజీవ్, తమన్ మరియు నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మీరంతా కలిసి, ఈ కథను నమ్మి, ఈ విజయాన్ని సాకారం చేశారు. ఈ రోజు, మేము నీ విజయాన్ని వేడుక చేసుకుంటున్నాము. ఇలాగే వెలుగుతూ ఉండాలో అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.
Five years… I stood by and watched everything.
My son carried the silence, the pain, the disappointments… but never stopped trying. There were no hits to his name, only failures that kept testing him. I know how much it hurt him, even when he never said it.
We used to pacify… pic.twitter.com/fO11AXgyt3— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2026
Also See : Kiara Advani : టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. మైమరిపించిన కియారా అద్వానీ..
దీంతో కొడుకు సక్సెస్ చూసి ఆనందిస్తున్న తండ్రిగా నాగబాబు ఈ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడని ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
