Nagababu : రజినీకాంత్ జైలర్ సినిమాలో మెగా బ్రదర్ స్పెషల్ అట్రాక్షన్..
జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, సునీల్.. వీళ్ళే కాక మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట.
- Saketh U
- Published on- August 10, 2023 / 07:49 AM IST
Nagababu Guest Appearance in Rajinikanth Jailer Movie
Nagababu : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ‘జైలర్’(Jailer) సినిమా తెరకెక్కింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించగా నేడు ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాలో తమన్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే తమిళనాడు, కేరళ.. పలు చోట్ల జైలర్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. జైలర్ సినిమా చూసిన వాళ్లంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, సునీల్.. వీళ్ళే కాక మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఏ విషయాన్ని షేర్ చేస్తుండగా నాగబాబు స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పారు.
Jailer Twitter Review : జైలర్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ లోకి దిగితే..
రజినీకాంత్ తో జైలర్ సినిమా షూట్ టైములో దిగిన ఫోటోని, జైలర్ పోస్టర్స్ తో కలిపి వీడియో రూపంలో తన వాయిస్ ఓవర్ తో పోస్ట్ చేశారు. తాను చిన్నప్పట్నుంచి రజినీకాంత్ ఫ్యాన్ అని, ఇప్పుడు రజినీకాంత్ తో ఒక్క సీన్ లో కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉందని, జైలర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
