Chiranjeevi : మెగా మేకోవర్.. తమ్ముణ్ణి మిస్ చేసిన నాగబాబు..?

మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్ట్ మెగాభిమానులను ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురి చేస్తుంది..

Chiranjeevi

Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు చేసిన పోస్ట్ మెగాభిమానులను ఆశ్చర్యంతో కూడిన అయోమయానికి గురి చేస్తుంది. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు ఎప్పుడూ అప్‌డేట్ ఉంటారు. ఏ విషయం గురించైనా తన స్టైల్లో కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారాయన.

Allu Ramalingaiah : అల్లు రామలింగయ్యకు చిరు – బన్నీ నివాళులు..

నాగబాబు రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి మాంచి స్టైలిష్‌ లుక్‌లో ఉన్న పిక్ ఒకటి షేర్ చేశారు. చిరు ఫొటోకి రెండు వైపులా మెగా అండ్ అల్లు యంగ్ హీరోల పిక్స్ ఉన్నాయి. దీనికి ‘ఈ ఫొటోలో ఉన్న వాళ్లందరికంటే మీరే యంగ్‌గా కనిపిస్తున్నారు. ‘ఇప్పటివరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్‌లో కానీ విమ్మల్ని ఎవరూ బీట్ చెయ్యలేరు అన్నయ్యా’ అంటూ కామెంట్ చేశారు నాగబాబు.

Chiranjeevi : స్పీడ్ మీదున్న చిరు..

అల్లు, మెగా హీరోలందరి పిక్స్ పెట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టలేదేంటి? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగబాబు మనసులో తమ్ముడు పవన్ ఇంకా యంగ్‌గానే ఉన్నట్లు భావిస్తున్నారు.. అందుకే పవన్ కళ్యాణ్ పిక్ పెట్టలేదు అంటూ క్లారిటీ ఇచ్చే విధంగా మరికొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా మెగాస్టార్ మేకోవర్ కానీ, లుక్ కానీ కిరాక్ ఉంది అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.