Bigg Boss 8 : బిగ్‌బాస్ 8 ప్రోమో చూశారా? పవన్, మహేష్ స్టైల్లో నాగార్జున..

తాజాగా బిగ్ బాస్ ప్రమోషనల్ ప్రోమోని విడుదల చేసారు.

Nagarjun Bigg Boss Telugu Season 8 Promotional Promo Released

Bigg Boss 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తిచేసుకొని తెలుగులో ఇప్పుడు 8వ సీజన్ తో రాబోతుంది బిగ్ బాస్. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 లోగో ప్రోమోని విడుదల చేయగా తాజాగా బిగ్ బాస్ ప్రమోషనల్ ప్రోమోని విడుదల చేసారు.

Also Read : Puri Jagannadh : లైగర్ ఫ్లాప్ అయ్యాక రాజమౌళి వాళ్ళ నాన్న ఫోన్ చేసి అలా అన్నారు.. నేను ఎమోషనల్ అయిపోయాను..

ఈ బిగ్ బాస్ ప్రమోషనల్ వీడియోని నాగార్జున, కమెడియన్ సత్య, కొంతమంది అమ్మాయిలతో కలిసి ఆసక్తికరంగా చిత్రీకరించారు. ‘ ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు..’ అని పోకిరి స్టైల్ డైలాగ్స్, ‘దేకో దేకో గబ్బర్ సింగ్.. లాగా దేకో దేకో బిగ్ బాస్..’ అని పవన్ స్టైల్ లో ఓ పాటని చూపించారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. షో కూడా అంతే ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. మరి ఈసారి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారో చూడాలి. మీరు కూడా బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..

 

ట్రెండింగ్ వార్తలు