Akkineni Nagarjuna: నాలుగు దశాబ్దాల ‘కింగ్’ సామ్రాజ్యం.. ‘కౌంట్‌లెస్ హార్ట్స్ కింగ్’ స్పెషల్ పోస్టర్.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్
సినీ ఇండస్ట్రీ ప్రయాణంలో 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna).
- V Santhosh Kumar
- Published on- May 23, 2026 / 04:31 PM IST
Nagarjuna Akkineni 40 years career
- నాగార్జున హీరోగా 40 ఏళ్లు పూర్తి.
- ‘మే 23’ నాగ్ కెరీర్‌లో హిస్టరీ.
- 100వ సినిమాతో కింగ్ రెడీ.
Akkineni Nagarjuna: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున సినీ ప్రస్థానంలో ‘మే 23’ తేదీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. సరిగ్గా 40 ఏళ్ల క్రితం అనగా 1986 ఇదే రోజున ‘విక్రమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, నేటితో విజయవంతంగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ నాగ్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన మొదటి చిత్రం విడుదలైన రోజే, 2014లో తండ్రి ఏఎన్నార్ చివరి చిత్రం ‘మనం’ విడుదలై క్లాసిక్ హిట్‌గా నిలవడం తన జీవితంలో మర్చిపోలేని అరుదైన కో-ఇన్సిడెన్స్ అని ఆయన పేర్కొన్నారు.
Peddi: ‘పెద్ది’ సినిమాకు ఎగ్జిబిటర్ల షాక్.. పర్సంటేజ్ ఇస్తేనే థియేటర్లలో ప్రదర్శన.. అల్టిమేటం జారీ
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నాగార్జున(Akkineni Nagarjuna)ను ‘కౌంట్‌లెస్ హార్ట్స్ కింగ్’గా అభివర్ణిస్తూ ఒక క్రేజీ పోస్టర్‌ను విడుదల చేసింది. మరోవైపు అభిమానులు సైతం ‘మన్మథుడు’ వంటి ల్యాండ్‌మార్క్ చిత్రాలను 4K రీ-రిలీజ్‌లతో థియేటర్లలో ప్రదర్శిస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇన్నేళ్లుగా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులకు, అభిమానులకు నాగార్జున ఈ సందర్భంగా తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రస్తుతం నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాగ్ మునుపెన్నడూ లేని డిఫరెంట్ గెటప్స్, స్టైలిష్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ఐకానిక్ హిట్స్ ‘శివ’, ‘రక్షకుడు’ చిత్రాల తరహాలోనే ఇందులో కూడా నాగ్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నట్లు టాక్. ఈ మైల్‌స్టోన్ మూవీతో కింగ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తారోనని టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Thank you for all the blessings and love being showered on me today🙏🙏🙏
May 23!! the date I cannot forget!!
The day which I had the honour of producing and releasing the last film MANAM of my legendary father ANR🙏 the film which I had the privilege of working both with my…— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026
