Nagarjuna : నాగార్జున ఇప్పటికి మన్మథుడిగా ఉండటానికి కారణం అదేనా.. డైలీ రాత్రి పడుకునేటప్పుడు అది తినాల్సిందేనట..
ప్పుడు మీడియా ముందుకి వచ్చినా ఈ ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. తాజాగా నాగ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే అడగగా నాగ్ తన ఫుడ్ సీక్రెట్స్, తన ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పకపోయినా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
- Saketh U
- Published On : August 22, 2023 / 09:23 AM IST
Nagarjuna shares an interesting secret about his food
Nagarjuna : టాలీవుడ్(Tollywood) కింగ్(King) నాగార్జున.. 60 ఏళ్ళు వచ్చినా ఇంకా మన్మధుడిలాగానే కనిపిస్తూ ఈయనకి ఏజ్ అవ్వదా అనే సందేహం వచ్చేలా చేస్తున్నారు. ఇప్పటికి కూడా అదే అందాన్ని అదే ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తున్నారు నాగార్జున. ఒకప్పుడు అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్న నాగ్ ఇప్పటికి కూడా అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆయన అంత బాగా అందాన్ని, బాడీని మెయింటైన్ చేస్తున్నాడు.
నాగార్జున ఈ ఏజ్ లో కూడా అంత యాక్టివ్ గా, అంత అందంగా అందటానికి కారణం ఏంటా అని అంతా సందేహిస్తారు. ఎప్పుడు మీడియా ముందుకి వచ్చినా ఈ ప్రశ్న కచ్చితంగా అడుగుతారు. తాజాగా నాగ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే అడగగా నాగ్ తన ఫుడ్ సీక్రెట్స్, తన ఫిట్నెస్ సీక్రెట్స్ చెప్పకపోయినా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
Dil Raju : గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ గురించి నాకేం తెలీదు.. నన్ను అడగకండి..
మీరు ఇలా కనపడటానికి ఫుడ్ బాగా కండిషన్స్ తో తింటారు కదా అని అడగగా నాగార్జున సమాధానమిస్తూ.. ఫుడ్ లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా ప్రతి రోజు రాత్రి నేను ఐస్ క్రీం తినందే పడుకోను. నాకు ఐస్ క్రీం తినకపోతే నిద్రపట్టదు. ఒకవేళ ఐస్ క్రీం లేకపోయినా ఏదో ఒక స్వీట్ లేదా డిజర్ట్ అయినా ఉండాల్సిందే. ఇన్నేళ్ల నుంచి నా బాడీ ఒక సిస్టమ్ లో పడిపోయింది. రోజు ఇది తినాలి, ఈ వ్యాయామం చేయాలి అంటూ ఒకటే రొటీన్ ఉంటుంది. నట్స్, స్పెషల్ ఫుడ్ తిన్నా మిగిలినవి కూడా తింటాను. నేను కావాలనుకుంటే బరువు తగ్గగలను, పెరగగలను నా బాడీని ఇన్నేళ్ల నుంచి అలా ట్యూన్ చేశాను అని అన్నారు. దీంతో నాగ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
