Nagavamsi : అఖిల్ పొగరుగా బిహేవ్ చేస్తాడు అనుకుంటారు.. మొదటిసారి కష్టపడ్డారు అన్నారు.. నాగవంశీ వ్యాఖ్యలు వైరల్..

ఈ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. (Nagavamsi)

  • Published on- July 5, 2026 / 09:39 PM IST

Nagavamsi

Nagavamsi : అఖిల్ అక్కినేని, భాగ్య‌శ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా జులై 10న రిలీజ్ కానుంది.

నేడు అఖిల్ లెనిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున గెస్ట్ గా హాజరయ్యారు.

Also See : Yashashree Rao : రీసెంట్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ.. యశశ్రీ రావు క్యూట్ ఫొటోలు..

ఈ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. అందరూ నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారబ్బాయి అఖిల్ పొగరుగా బిహేవ్ చేస్తాడు అని, చాలా అది ఇది అనుకుంటారు. కానీ ఈ సినిమాకు అఖిల్ నాతో పనిచేయడానికి కష్టపడ్డాడు. నేను అతన్ని ఇబ్బంది పెట్టాను. అతని ఫోన్స్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇన్నాళ్లు నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారబ్బాయి అని, గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు అని అనేవారు. కానీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక బయట అఖిల్ మొదటిసారి కష్టపడినట్టు కనపడుతుంది అని అన్నారు.

అలా అనడానికి అఖిల్ సంవత్సరంన్నర కష్టపడ్డారు. ఈ సినిమా ఇంటర్వెల్, లాస్ట్ 40 నిముషాలు ఖంగు తింటారు. సినిమాలో సర్ ప్రైజ్ అవుతారు. స్క్రీన్ ప్లే బాగుంటుంది. పాత్రలు రంగులు మారతాయి. జులై 10 ఎవరూ డిజప్పాయింట్ అవ్వరు. ఈ సారి మాత్రం అఖిల్ డిజప్పాయింట్ చేయరు. మీరు ఆ భయమే పెట్టుకోవద్దు. నాకు, థమన్ కాంబోలో ఫెయిల్యూర్స్ లేవు అసలు. సునీల్ నా సినిమాలో ఉంటే హిట్ అది. ఈ సినిమా హిట్ అని అన్నారు.