Nagavamsi : చరణ్ ఫ్యాన్స్ కి భయపడి మంచి సినిమాకు లాభాలు పోగొట్టుకున్న నిర్మాత..?

తాజాగా లెనిన్ ప్రమోహన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్లాస్ట్ జోన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Nagavamsi)

  • Published on- July 7, 2026 / 04:20 PM IST

Nagavamsi

Nagavamsi : ఒక్కోసారి మంచి సినిమాలు వచ్చినా, హిట్ టాక్ వచ్చినా ప్రమోషన్స్ లేక ఆ సినిమాలకు కలెక్షన్స్ రావు. అలాంటి మంచి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ బ్లాస్ట్ అనే సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు తమిళ్ లో. అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ సినిమా తెలుగులో బ్లాస్ట్ జోన్ గా రిలీజయింది.

తెలుగులో కూడా ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ మాత్రం యావరేజ్ గా వచ్చాయి. ఈ సినిమాకు తెలుగులో అసలు ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం. కేవలం ఒకేఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేసారు. ఇంత మంచి సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేదు, ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి కదా అని అందరూ నాగవంశీని ప్రశ్నిస్తున్నారు.

Also Read : Rishab Shetty : ఫ్యామిలీతో కలిసి రిషబ్ శెట్టి పుట్టిన రోజు వేడుకలు.. భార్య పిల్లలతో ఫొటోలు వైరల్..

తాజాగా లెనిన్ ప్రమోహన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్లాస్ట్ జోన్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాగవంశీ మాట్లాడుతూ.. బ్లాస్ట్ జోన్ సినిమాకు ప్రచారం చేయడానికి సమయం లేదు. అప్పుడే పెద్ది సినిమా రిలీజయింది. నేను ప్రమోషన్స్ చేస్తే కావాలనే క్రాస్ ప్రమోషన్స్ చేసారు అని అంటారు. పెద్ది రిలీజ్ అయ్యాక చేస్తే పెద్ది సినిమాకు డ్యామేజ్ చేయడానికి మైక్ పట్టుకున్నావా అని అంటారు. పైగా పెద్ది సినిమా నిర్మాత సతీష్ కిలారు నాకు ఫ్రెండ్. అతని మొదటి సినిమా పెద్ది. అందుకే నేను ప్రమోషన్ చేయలేదు. ఒకవేళ బ్లాస్ట్ జోన్ ఒక రెండు వారాల ముందు వచ్చి ఉంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి. అయినా ప్రమోషన్స్ లేకుండా కూడా బాగానే వసూళ్లు వచ్చాయి. ఓటీటీలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. నేను కూడా రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు అని అన్నారు.

దీంతో నాగవంశీ కామెంట్స్ వైరల్ గా మారాయి. పెద్ది సినిమాకు మంచి జరగాలని ఓ మంచి సినిమా ప్రమోషన్స్ ఆపేసానని అంటున్నారు నాగవంశీ. అంతే కాకుండా పెద్ది రిలీజ్ సమయంలో ఈ సినిమా ప్రమోట్ చేస్తే తనపైనే చరణ్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తాయని ముందే ఊహించారని అంతా అనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలతో. చరణ్ ఫ్యాన్స్ పెద్ది కి డ్యామేజ్ చేయడానికి నాగవంశీ వచ్చాడని అంటారని ముందే ఊహించి మంచి సినిమా కలెక్షన్స్ పోగొట్టుకున్నారు. బ్లాస్ట్ జోన్ సినిమా మే 28 రిలీజ్ అయింది. పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ అయింది.