Nagavamsi : అప్పులు చేసి సినిమాలు తీసేది వాళ్ళ కాళ్ళ దగ్గర నించోడానికా.. డిస్ట్రిబ్యూటర్స్ ని చంపేయాలని చూస్తున్నారు.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు..
మొదట్నుంచి నిర్మాత నాగవంశీ పర్సెంటేజ్ సిస్టమ్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. (Nagavamsi)
- Saketh U
- Published on- July 7, 2026 / 09:01 PM IST
Nagavamsi
Nagavamsi : టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా థియేటర్స్ రెంటల్ వర్సెస్ పర్సెంటేజ్ సిస్టమ్ అని వివాదం సాగుతూనే ఉంది. ఇండస్ట్రీలో థియేటర్స్ ఉన్న ఒకరిద్దరు పెద్ద నిర్మాతలు కొంతమంది ఎగ్జిబిటర్లతో కలిసి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అని వివాదం సృష్టిస్తున్నారని అంతా భావిస్తున్నారు. దీనిపై చాలా మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. పెద్ది సమయంలో ఈ గొడవ చాలా పెద్దగానే అయింది. నిర్మాతలు, మెగాస్టార్, ఫిలిం ఛాంబర్.. ఇలా అందరి మీటింగ్స్ అయినా ఈ థియేటర్స్ పర్సెంటేజ్ సిస్టమ్ గొడవ పరిష్కారం కాలేదు.
మొదట్నుంచి నిర్మాత నాగవంశీ పర్సెంటేజ్ సిస్టమ్ ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవల పెద్ది రిలీజ్ సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్స్ బాగుచేయండి, థియేటర్స్ లెక్కలు చెప్పండి అవన్నీ బాగుంటే పర్సెంటేజ్ ఓకే అన్నారు కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు.
Also Read : Mithila Palkar : ‘సూపర్ సుబ్బు’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన మిథిలా పాల్కర్.. ఫొటోలు..
తాజాగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చేది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ చంపేయడానికి. ఏదైనా మా సినిమాలు రిలీజ్ కి వస్తే ఆ పెద్ద నలుగురు నిర్మాతలు దగ్గరకు వెళ్లి మా సినిమా రిలీజ్ చేయమని అడుక్కుంటే వాళ్ళు మా మీద జాలి పడి మేము పది కోట్లు అడిగితే ఓ నాలుగైదు కోట్లు ఇచ్చి సినిమా రిలీజ్ చేసే పొజిషన్ కి తీసుకురావాలని చూస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని చంపేయడానికి చూస్తున్నారు వాళ్ళు.
డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తీసేసి పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి మీ చార్ట్ అంతా మేము చూస్తాము మాకు ఒక రెండు లేదా మూడు శాతం ఇవ్వండి అంటారు. డిస్ట్రిబ్యూటర్స్ కి అడ్వాన్స్ లు ఇవ్వము అంటారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలకు ఇవ్వలేరు. అలా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ మొత్తం తీసేస్తే మేము వెళ్లి వాళ్ళ కాళ్ళ ముందు నించోవాలి. ఇది వాళ్ళ టార్గెట్. నిర్మాతలంతా అప్పులు చేసి సినిమాలు తీసేది వాళ్ళ కాళ్ళ దగ్గర నించోడానికా కాదు కదా అందుకే ఈ ఫైట్ అని అన్నారు. మరి దీనిపై పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అనే నిర్మాతలు ఏమని స్పందిస్తారో చూడాలి.
Also See : Anna Lezhneva : ట్రెడిషినల్ లుక్స్ లో పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా లెజినోవా ఫొటోలు..
