అలనాటి ప్రముఖ నటీమణి గీతాంజలి మరణ వార్త విని షాక్‌కి గురయ్యానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు..
అలనాటి ప్రముఖ నటీమణి గీతాంజలి మరణ వార్త వినగానే షాక్ కి గురయ్యానని నందమూరి బాలకృష్ణ అన్నారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ (అక్టోబర్ 30,2019) రాత్రి 11.45 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
గీతాంజలి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు.. హైదరాబాద్ నందినగర్‌లోని ఆమె నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. గీతాంజలి మృతికి బాలకృష్ణ సంతాపం తెలిపారు.
Read Also : సీతారామ కళ్యాణంలో ‘సీత’ క్యారెక్టర్ – గీతాంజలి కెరీర్‌ను మలుపు తిప్పింది.
‘గీతాంజలిగారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉందామెకు.. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్ చేసిన ‘సీతారామకళ్యాణం’ సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’.. అంటూ గీతాంజలి మృతిపై స్పందించారు బాలయ్య..